జనవరి–మార్చి కాలానికి ఐఎండీ అంచనా
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విభిన్నమైన అంచనాలను వెలువరించింది. ఈ మూడు నెలల్లో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య భారతంలో వర్షాలు పడతా యని తెలిపింది. పంజాబ్, హరియాణాల్లో మాత్రం చెదురుమదురుగా జల్లులు పడతాయంది. రబీ పంటలపై ఇవి ప్రభావం చూపించే అవకాశం లేదని స్పష్టం చేసింది.
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర గురువారం మీడియా సమా వేశంలో ఈ వివరాలను వెల్లడించారు. బిహార్, విదర్భ ప్రాంతాల్లో మాత్రం ఈ సమయంలో అదనంగా మరో మూడు రోజులపాటు చలి వాతావరణం కొనసాగ నుండగా రాజస్తాన్‌లో మాత్రం చలి ప్రభా వం తగ్గుతుందని పేర్కొన్నారు. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలు న్నాయన్నారు. ఇదే సమయంలో, ఈశాన్య, వాయవ్య, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం సాధారణానికి మించి ఉష్ణోగ్రతలుంటాయని చెప్పారు.


