breaking news
central india
-
దేశంపై మళ్లీ కరోనా పడగ
న్యూఢిల్లీ: చలికాలం వణికిస్తున్న కొద్దీ కరోనా కూడా విజృంభిస్తోంది. ప్రధానంగా ఉత్తర, మధ్య భారతంలోని పలు రాష్ట్రాల్లో పడగ విప్పింది. రోజు రోజుకీ కేసులు ఎక్కువ అయిపోతూ ఉండడంతో నిబంధనల చట్రంలోకి ఒక్కో రాష్ట్రం వెళ్లిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణా వంటి రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఈ రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ మొదలైందన్న ఆందోళన నెలకొంది. హరియాణాలో మొదటిసారిగా రోజుకి 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెలాఖరువరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో అయిదు జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ప్రకటించారు. భోపాల్, ఇండోర్, గ్వాలియర్, రాట్లామ్, విదిశ జిల్లాల్లో కోవిడ్–19 రేటు 5% కంటే ఎక్కువ పెరిగిపోయింది. దీంతో కర్ఫ్యూ విధించక తప్పడం లేదని సీఎం చెప్పారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదరా, రాజ్‌కోట్‌లో నిరవధికంగా రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. రాజస్తాన్‌లో రోజుకి సగటున 3 వేల కేసులు నమోదవడంతో 33 జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్లు కదిలి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మహారాష్ట్రలో 9,10 తరగతులకు తిరిగి పాఠశాలలను తీయాలని భావించినప్పటికీ, మళ్లీ కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఈ ఏడాది చివరి వరకు పాఠశాలలను మూసివేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో ఒకే రోజు 7,500 కేసులు దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల్లో 7,500 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో కరోనా కట్టడికి కేజ్రీవాల్ సర్కార్ పలు చర్యలు తీసుకున్నప్పటికీ కేంద్రం కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. డిసెంబర్లో కేసులు మరింతగా పెరిగిపోతాయని అంచనాలున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచిన కేంద్రం నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తోంది. దీపావళి తర్వాత పెరిగిపోతున్న కేసులు ఆరు నెలల కాలంలో భారత్‌లో రోజు వారీ కేసులు అత్యధిక స్థాయికి చేరుకొని మళ్లీ తగ్గినట్టే తగ్గి పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ 10న ఇంచుమించుగా లక్ష వరకు రోజువారీ కేసులు (99,181 కేసులు నమోదు) చేరుకున్నాయి. అక్టోబర్ చివరి వారం నుంచి తగ్గు ముఖం పట్టిన కేసులు, మళ్లీ ఇప్పుడు పెరిగిపోతూ ఉండడంతో సెకండ్ వేవ్ మొదలైందనే భావించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 13 కోట్లు దాటిన కరోనా పరీక్షలు సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ మహమ్మారి కరోనాకు వ్యతిరేక పోరాటంలో భారత్ మరో మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటి వరకూ 13,06,57,808 పరీక్షలు చేశారు. వీటిలో చివరి కోటి పరీక్షలను 10 రోజుల వ్యవధిలో నిర్వహించడం గమనార్హం. యూరప్, అమెరికన్ దేశాల్లో రోజువారీ కేసులు పెరుగుతున్న సమయంలో, మనదేశంలో కరోనా కట్టడికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించాయి. అయితే 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే తక్కువ పరీక్షలను నిర్వహించాయి. ఈ రాష్ట్రాల్లో పరీక్ష స్థాయిలను పెంచాలని కేంద్రం సూచించింది. 33 మంది అధికారులకు కరోనా ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్న 428 మంది ఆఫీసర్ ట్రైనీలలో 33 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అకాడమీలోని పలు డిపార్ట్మెంట్లను ముందు జాగ్రత్తగా మూసివేసిట్లు అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 30 వరకూ క్లాసులను ఆన్లైన్ ద్వారా బోధించనున్నట్లు తెలిపారు. కొత్త కేసులు.. 46 వేలు దేశంలో గత 24 గంటల్లో 46,232 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90.50 లక్షలకు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 564 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,32,726కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 84.78 లక్షలకు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.67 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,39,747గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.86 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది. ఈ నెల 20 వరకూ 13.06 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం 10,66,022 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. -
వచ్చేవారం విస్తారంగా వర్షాలు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కొన్ని ప్రాంతాల్లో 25 శాతం అధిక, మరికొన్ని ప్రాంతాల్లో అదే మోతాదులో లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గణాంకాలు పేర్కొన్నాయి. అయితే వచ్చేవారం ఉత్తరాది, మధ్య భారత్‌లకు రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో భానుడి ప్రతాపం ఇంకా కొనసాగుతుండగా రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈనెల 27నుంచి ఉత్తరాది, మధ్య భారత్‌లో వాతావరణం చల్లబడటంతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. జూన్ 29న దేశ రాజధాని ఢిల్లీకి రుతుపవనాలు తాకనున్నాయని చెప్పారు. రానున్న 48 గంటల్లో ఒడిషా, పశ్చిమ బెంగాల్ సహా గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో, మహారాష్ట్ర, తూర్పు యూపీలో వర్షాలు కురుస్తాయన్నారు. ఇక నైరుతి రుతుపవనాల రాకతో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు శనివారం నాటికి మైనస్ 10గా నమోదైంది. -
235 జిల్లాల్లో కరువు ఛాయలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తినా చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదవలేదు. దేశంలోని 235 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షం కురిసింది. ఈ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 20 శాతం తక్కువగా, తొమ్మిది జిల్లాల్లో 60 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భలో ఈ జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి. యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్‌లో వరుసగా 31 శాతం, 28 శాతం, 25 శాతం సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. రుతుపవనాల ఆరంభంలో జూన్, జులై రెండు నెలలు దేశవ్యాప్తంగా 2.5 శాతం మిగులు వర్షపాతం నమోదై ఆశలు రేకెత్తించినా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 12 వరకూ సాధారణ వర్షపాతం కంటే 17 శాతం తక్కువ నమోదైంది. రుతుపవనాల విస్తరణ ఆశాజనకంగా లేకపోవడంతో దుర్భిక్ష పరిస్థితులు తప్పేలా లేవనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కేవలం 110 జిల్లాల్లో ఎక్కువ, అత్యధిక వర్షపాతం నమోదైంది. గుజరాత్, రాజస్ధాన్, హిమాలయాల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అసోం తదితర రాష్ర్టాల్లో వరదలు పోటెత్తాయి. మధ్య భారత్, సహా ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లోని అత్యధిక ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం సైతం నమోదవలేదు. అయితే మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు విస్తరించి మధ్యభారత్ సహా వర్షపాతం తక్కువగా నమోదైన ప్రాంతాల్లోనూ వర్షాలు మెరుగవుతాయని ఐఎండీ ఆశాభావం వ్యక్తం చేసింది. -
మధ్య భారతంలో మహా పోరు
జాతిహితం మందిర్ ఊపు తరువాత బీజేపీ పటిష్టం కావడానికి కారణం అది కుల రాజకీయాలను అర్థం చేసుకుంది. కుల సమీకరణలను కాంగ్రెస్ కంటే వేగంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ ఇటీవలి కాలంలో కింద కులాల నుంచి ఒక్క కీలకమైన నాయకుడిని కూడా అందించలేకపోయింది. ఉత్తరప్రదేశ్, బిహార్లలో కాంగ్రెస్‌లో కంటే బీజేపీలోనే పెద్ద పెద్ద ఓబీసీ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవలి దశాబ్దాలలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో కనిపించే అతి పెద్ద ఓబీసీ నాయకుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక్కరే. కులం, రాజకీయాల పరస్పరానుబంధం భారతదేశంలోను, విదేశాలలోను డజన్ల కొద్దీ, ఇంకా చెప్పాలంటే వందల కొద్దీ పీహెచ్డీ సిద్ధాంత వ్యాసాలను రాయించింది. ఈ విషయం మీద పరిశోధన చేస్తూ జీవితకాలం విద్యార్థి వేతనాలు పొందిన వ్యక్తులు ఈ అంశాన్ని లోతుగా విశ్లేషించారు. నేను మన రాజకీయాలలో కులం పాత్ర గురించి మాట్లాడుతున్నాను. అయితే పరిశోధకుడి ముసుగులో మాత్రం కాదు, రాజకీయాంశాలను నివేదించే పత్రికా రచయితగానే వాటి గురించి మాట్లాడుతున్నాను. ఈ వారం జాతిహితం శీర్షికకు ఉత్తర బిహార్‌లోని ముజఫర్‌పూర్ కేంద్రం నుంచి రాయడానికి మించిన అర్హత కలిగిన మరో అంశం కనిపించదు కూడా. ఎన్నికల తీరును పరిశీలించడానికి ఆ ప్రాంతంలో వారం రోజులుగా తిరుగుతూ, గోడల మీద రాతలు చదువుకుంటూ ఇది రాశాను. ఎన్నికల వార్తలను సేకరించడానికి బిహార్ వెళితే, ఒక గంట సమయంలో ‘కులం’ అనే మాటను ఆరుసార్లయినా వింటాం. ఇంకో రాష్ట్రానికి ఈ పని మీద వెళితే ఆ మాటే ఇంకొన్ని సార్లు తక్కువగా వినిపిస్తుంది. అంతేగానీ సంభాషణల మధ్య నుంచి ఆ పదం ఎక్కడికీ పోదు. బహుశా పశ్చిమ బెంగాల్, కొంత వరకు అసోం ఇందుకు మినహాయింపు అనుకోవచ్చు. కులరాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ఎన్నికలకు మించిన సందర్భం మరొకటి ఉండదు. 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమ యంలో హరియాణాలోని కురుక్షేత్ర నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు విస్తుపోయే అనుభవం ఒకటి ఎదురైంది. అప్పుడు షెడ్యూల్డ్ కులాలకు (అప్పుడు దళిత్ అన్న పదం పెద్దగా ఉపయోగించేవారు కాదు) చెందిన జిల్లా పోలీసు అధిపతి ఒకరు- భజన్‌లాల్ విధేయుడు- నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఆయన ఒక నోట్ ప్యాడ్ తీసుకుని ఒక్కొక్క కులాన్ని విభజించి, దాని వాటాను సూచిస్తూ బొమ్మలు గీసి, ఎవరు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందో వివరించాడు. చివరికి ఆయన చెప్పినదేమిటంటే, షెడ్యూల్డ్ కులాల ఓట్లు ఎటు పడితే, అటు కాటా మొగ్గుతుందనీ, అందులో మూడింట రెండు వంతుల ఓట్లు ‘మనవి’ (అంటే ఆయన అభిమానించే బాబూ జగ్జీవన్‌రామ్ సామాజిక వర్గానివి) అని చెప్పాడు. తరువాత సామూహికంగా పార్టీ ఫిరాయించి సంచలనం సృష్టించినా, అప్పటికి భజన్‌లాల్ బాబూజీ వైపు ఉన్నారు. ఎస్సీలలో మిగిలిన వారు ఎవరు అని నేను అడిగాను. ‘మిగిలినవి కింది కులాల వారివి’ అని ఆ పోలీస్ చీఫ్ చెప్పాడు. కులం గురించి అంత యథేచ్ఛగా మాట్లాడడానికి ఆయన తన స్థాయి నుంచి పక్కకు జరిగాడని నేను అనుకున్నాను. తరువాత కాలంలో కూడా ఇలాంటివే మరో రెండు సందర్భాలు తటస్థించాయి. 1983లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సుదీర్ఘ సమ్మె జరిగినప్పుడు, ‘బ్రాహ్మణులు, ఠాకూర్లు, భూమిహార్లు; తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బిహార్ అంటూ ఒక ఆచార్యుడు చాలా సహాయపడే రీతిలో కుల పరిభాషలో అక్కడి రాజకీయాలను గురించి వివరించిన తీరు చూసి నాకు చాలా ఆసక్తి కలిగింది. అయితే కులం ప్రాధాన్యం బాగా ప్రస్ఫుటమైనది మాత్రం ఎనభై దశకంలో రాజీవ్‌గాంధీ, ఆయన పార్టీ కాంగ్రెస్ పతనమైన తరువాతే. కాన్షీరామ్ తన సామాజిక సిద్ధాంతాన్ని రాజకీయ పార్టీగా మలచి, ఆ దశాబ్దపు ఎన్నికలలో మూడో శక్తిగా అవతరించారు. బోఫోర్స్ వివాదంపై రాజీవ్ మంత్రిమండలి నుంచి రాజీనామా చేసి, మళ్లీ పార్లమెంటుకు రావడానికి వీపి సింగ్ అలహాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అమితాబ్ బచ్చన్ తిరోగ మనంలో పడ్డారు. కాంగ్రెస్ తన అభ్యర్థిగా లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రిని బరిలోకి దింపింది. కాన్షీరామ్ ‘ఓట్లు మావి, రాజ్యాం మీదా, ఇకపై సాగదు’ అన్న తన నినాదంతో రంగంలో దిగారు. ఆయన అప్పుడు దేని గురించి మాట్లాడారో తలుచుకుంటే మాలో కొందరు విస్తుపోతూ ఉంటాం. తరువాత ఆయనకు వచ్చిన ఓట్లు, మూడో స్థానానికి పరిమితం కావడం చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వీపీ సింగ్ మండల్ కమిషన్ నివేదిక అమలులో పెట్టడం, అగ్రవర్ణాల నిరసనలు, మూడో ఫ్రంట్‌కు ములాయం సింగ్ యాదవ్, లాలూప్రసాద్ అగ్రసేనానులు కావడం వంటి పరిణామాలతో తరువాత మూడేళ్ల కాలంలో కులం సత్తా ఏమిటో వెల్లడైంది. అప్పుడే మందిర్ పరిణామాలు తలెత్తడంతో వెనుకబడిన కులాల ఆధిపత్యాలను తగ్గించడానికి దోహదం చేసింది. ఆ తరువాతే కీలకమైన మధ్య భారత రాజకీయాలు మండల్, కమండల్ పేర్లతో పిలుచుకోవడం మొదలైంది. బిహార్ ఎన్నికల పోరును లాలూ యాదవ్ ఈ స్థాయికి తీసుకువెళ్లారు. అయితే సుశీల్ మోదీ మాత్రం మండల్, కమండల్ రెండూ తమతోనే ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. పాతికేళ్ల తరువాత ఇప్పుడు బిహార్ ఎన్నికలలో మండల్ కన్న బిడ్డలే కీలక పాత్రధారులయ్యారు. వారి విజయం- ఇంకో మాటలో చెప్పాలంటే కుల రాజకీయాల మీదే ఆధార పడి ఉంది. అందుకే వీరిని సవాలు చేస్తున్న నరేంద్ర మోదీ బృందం కూడా ఆ భాషలోనే మాట్లాడవలసి వస్తున్నది. సెక్యులర్/ కమ్యునల్ అంశం మీద మోదీ మాట్లాడితే ఇప్పటికీ, మీరు పోరాడదలచిన శత్రువు ఎవరు? పొరుగు మతమా; దారిద్య్రమా? చెప్పండన్న ధోరణిలోనే మాట్లాడుతున్నారు. అయితే బిహార్‌లో మాత్రం తన కులం గురించిన మూలాలను ఓటర్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. ఆయన పార్టీలోని సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ కూడా అత్యంత వెనుబడిన వర్గాల నుంచి లేదా ఈబీసీల నుంచి వచ్చారని మోదీని శ్లాఘిస్తున్నారు. కులం ఆధిక్యం గురించి బీజేపీ రాజకీయాలకీ, ఆరెస్సెస్ సిద్ధాంతానికీ మధ్య వైరుధ్యాలు వ్యక్తమయ్యాయి. ఆరెస్సెస్‌కు వర్ణం అనే అంశంలో మౌలికంగా ఆమోదం ఉన్నా, కులాన్ని విభజన శక్తిగా పునర్ మూల్యాంకన చేయడానికి కూడా ఆమోదం ఉంది. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించడం గురించి అక్కడ నుంచి ప్రశ్న రావడం అందుకే. హిందూ చింతనలో కులాన్ని ఒక విభజన శక్తిగానే ఆరెస్సెస్ చూస్తుంది. అయితే అగ్రకులాలను వదులుకోవడం దాని ఉద్దేశం కాకపోయినా, మండల్ రాజకీయాలతో పాత రాజకీయ వ్యవస్థ కదలడం, రాజకీయ వారసత్వాలు మారడం దానికి రుచించదు. బిహార్ ఎన్నికలలో బీజేపీ అవకాశాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా ఆలోచించకుండా రిజర్వేషన్లను సమీక్షించాలనడం అందుకే. ఆరెస్సెస్ లక్ష్యం పాతదే. కులం ద్వారా వచ్చిన విభజనను విశ్వాసం ద్వారా ఐక్యం చేయడం. మండల్ వారసులు గతంలోని డీఎంకె వారి వలె నాస్తికులు కాదు, ఏ వ్యవస్థనీ విశ్వసించని వారు కూడా కాదు. అయితే రాజకీయ వారసత్వాలను కులం ద్వారా పటాపంచలు చేయాలని వారు కోరుకుంటున్నారు. అందుకే వెనుకబడిన లేదా కింది కులాల రాజకీయాలు ఆరెస్సెస్ పాలిట శాపంగా మారాయి. కానీ నరేంద్ర మోదీ, అమిత్‌షాలకు వారి రాజకీయ ప్రాధాన్యాలు స్పష్టంగా తెలుసు. కాబట్టే వారు రిజర్వేషన్ రాజకీయాల వైపు మొగ్గారు. ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న ప్పటికీ, చరిత్రలో మున్నెన్నడూ లేనన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పటికీ, తన ప్రత్యర్థి కాంగ్రెస్ పతనావస్థలో మూలుగుతున్నప్పటికీ విశ్వాసానికీ, కులానికీ మధ్య ఏర్పడిన పోటీలో ఇప్పుడు కుల మే గెలుస్తున్నదని చెప్పడానికి నేను సందేహించను. అయితే బీజేపీ ప్రధాని ఈబీసీ వర్గానికి చెందినవారు. ఈ విషయాన్ని అది గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు, ముఖ్యంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వంటివారు వెనుకబడిన కులాల నుంచి వచ్చినవారే. నిజానికి మహారాష్ట్రకు ఒక బ్రాహ్మణ ముఖ్య మంత్రి వచ్చినప్పుడు, హరియాణాకు రెండు దశాబ్దాల తరువాత జాట్ కులానికి చెందని వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు - 2014 సంవత్సరం కేవలం ఆ రెండు సందర్భాలలోనే కులాన్ని పరిగణనలోనికి తీసుకోలేదు. ఊహించడానికి వీలుకాని ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ త్వరలో పునరావృతమవుతాయి. బిహార్‌లో బీజేపీ గెలిచినా అలాంటి సంఘటనకు మాత్రం అవకాశం లేకపోవచ్చు. అక్కడ వెనుకబడిన లేదా దళిత నాయకుడు ముందు వరసలో నిలవడం ఖాయం. 1989 మందిర్ ఊపు తరువాత బీజేపీ పటిష్టం కావడానికి కారణం అది కుల రాజకీయాలను అర్థం చేసుకుంది. కుల సమీకరణలను కాంగ్రెస్ కంటే వేగంగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. కాంగ్రెస్ ఇటీవలి కాలంలో కింద కులాల నుంచి ఒక్క కీలకమైన నాయకుడిని కూడా అందించలేక పోయింది. ఉత్తరప్రదేశ్, బిహార్లలో కాంగ్రెస్‌లో కంటే బీజేపీలోనే పెద్ద పెద్ద ఓబీసీ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవలి దశాబ్దాలలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో కనిపించే అతి పెద్ద ఓబీసీ నాయకుడు కర్ణాటక ముఖ్య మంత్రి సిద్ధరామయ్య ఒక్కరే. ఆయనను దేవెగౌడ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ దిగుమతి చేసుకుంది. బీజేపీ ఎందుకు పటిష్టమైందంటే, అది కొత్త వాస్తవాన్ని అంగీకరించింది కాబట్టేనని చెప్పడం సముచితంగా ఉంటుంది. కొత్తగా వస్తున్న వారి కోసం, వెనుకబడిన కులాలవారి ప్రతిభ నిరూపణ కావడం కోసం అగ్రకులాలకు చెందిన తన పాతతరం నాయకులను తప్పుకునేటట్టు బీజేపీ చేయగలిగింది. కాంగ్రెస్ పతనమైందంటే, ఈ వాస్తవాన్ని అది గుర్తించకపోవడం వల్లనే. అయితే బిహార్ ఎన్నికల ప్రచారంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఈ మార్పుల పట్ల ఆరెస్సెస్‌లో కొంత అసహనం రేగినట్లు తొలి సంకేతాల వల్ల అర్థమవుతున్నది. అలాగే సెక్యులర్ కూటమిలో తనది మూడో స్థానమేనన్న వాస్తవాన్ని కాంగ్రెస్ ఆమోదిస్తున్నట్టు కూడా కనిపిస్తున్నది. ప్రస్తుతం బీజేపీలో అంతర్గతంగా ఉన్న సందేహాలను సర్దుబాటు చేయడంలో ఆ పార్టీ ప్రదర్శించే సామర్థ్యం, కాంగ్రెస్ సహా ఇతర కులవాద పార్టీలు, ఓటు బ్యాంకు పార్టీలు ప్రదర్శించే వాస్తవిక దృక్పథం మధ్య భారత రాజకీయాల దిశను నిర్దేశిస్తాయి. ఇప్పటికీ పోటీ సాధికార రాజకీయాలకూ, హిందూత్వకూ మధ్య, ఇంకా- ఏది ఐక్యం చేయగలదు; ఏది విభజించగలదు? విశ్వాసమా, కులమా? అనే అంశాల మధ్యనే నెలకొని ఉంది. - శేఖర్ గుప్తా twitter@shekargupta