Crazy Fight Between Girl And Boy In Delhi Metro Over Rs 1000 Zara T-Shirt, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Delhi Girl Boy Fight Video: మెట్రో రైలులో లవర్స్‌ రచ్చ!.. అవాక్కైన ప్రయాణికులు.. వీడియో వైరల్‌

Jul 15 2022 4:32 PM | Updated on Jul 15 2022 4:50 PM

Crazy Fight Between Girl And Boy In Delhi Metro - Sakshi

వారిద్దరూ లవర్స్‌ అనుకుంటా.. సరదాగా మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా సీరియస్‌ అయిన ఆమె.. యువకుడిని పొట్టుపొట్టు కొట్టింది. ఇంతలో నన్నే కొడతావా అంటూ యువకుడు సైతం చెంపపై ఒక్కటిచ్చాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఓ యువతి, యువకుడు.. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ఇంతలో వారి మధ్య టీ షర్ట్‌ ధరపై వాగ్వాదం మొదలైంది. ఆమె తాను వేసుకున్న టీ షర్ట్‌ను వేయి రూపాయలకు కొనుగోలు చేశానని చెప్పింది. ఈ క్రమంలో యువకుడు.. ఆ టీ షర్ట్‌ రూ. 150కే దొరుకుతుందని ఫన్నీగా అన్నాడు. దీంతో, ఆమె కోపంతో ఊగిపోయి.. యువ‌కుడి చెంప చెల్లుమ‌నిపించింది. ఈ క్రమంలోనే "మమ్మీ కో బోలుంగీ మెయిన్" (నేను తల్లికి చెబుతాను) అని చెబుతుంది. 

దీనికి వెంటనే.. సదరు యువకుడు.."తేరే జైసా లడ్కా కిస్కికో నా మైలే" (నీలాంటి వ్యక్తి ఎవరికీ ఉండకూడదు) అంటూ బదులిచ్చాడు. దీంతో, మరింత రెచ్చిపోయిన యువతి.. వ‌రుస‌గా ఆమె చెంప‌దెబ్బ‌లు కొడుతుండ‌టంతో యువ‌కుడు కూడా ఆమె చెంప చెల్లుమ‌నిపించాడు. అనంతరం ఒకరిపై ఒకరు అరుచుకుంటూ స్టేషన్‌ రాగానే రైలు దిగి వెళ్లిపోయారు. అనంతరం వారి చేష్టలకు షాకైన ప్రయాణికులు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘సార్‌.. ప్లీజ్‌ మమ్మల్ని విడిచి వెళ్లొద్దు’.. టీచర్‌ అంటే ఇలా ఉండాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement