ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ వ్యాక్సిన్‌.. సీరమ్‌కు అనుమతివ్వండి

covid-19: Oxford vaccine human trial in India a step closer as panel - Sakshi

న్యూఢిల్లీ: బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌పై మూడో దశ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు పుణేలోని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)కు అనుమతి ఇవ్వాలని కోవిడ్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ శుక్రవారం డ్రగ్స్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. హ్యూమన్‌ ట్రయల్స్‌ అనుమతి  కోరుతూ సీరమ్‌ సంస్థ గురువారం నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేసింది. అదనపు సమాచారం జోడి స్తూ సవరించిన ప్రతిపాదనలను అందజేసింది.సీరమ్‌ దరఖాస్తుపై నిపుణుల కమిటీ శుక్రవారం చర్చించింది. దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో 1,600 మందిపై ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తామని సీరమ్‌ కంపెనీ తెలిపింది. ఇందులో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కాలేజీ కూడా ఉంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top