
మొన్నటితో పోలిస్తే కేసులు కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో.. 15,940 కొత్త కేసులు రికార్డు అయ్యాయి. పాజిటివ్ కేసులు కాస్త తగ్గినప్పటికీ.. వరుసగా రెండు రోజుల పాటు 15 వేల పైచిలుకు కేసులు నమోదవడం విశేషం.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం 91,779 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.21 శాతంగా ఉంది. కరోనా వల్ల గత 24 గంటల్లో 20 మంది చనిపోయారు.
కరోనాతో దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 5,24,974కి చేరింది. మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4, 27,61,481కి చేరుకుంది. కరోనా బారిన పడినవారిలో 98.58 శాతం కోలుకుంటున్నారు.
ఇక గడచిన 24 గంటల్లో 15,73,341 కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేశారు. దాంతో, దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 196.94 కోట్ల డోసులు పంపిణీ జరిగింది.