
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతుంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,761 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,42,734కు చేరింది. (చదవండి : తెలంగాణలో కొత్తగా 2,924 కేసులు)
కరోనాతో తాజాగా 948 మంది మృతి చెందారు. దీంతో మొత్త మరణాల సంఖ్య 63,498కు చేరింది. వైరస్ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు 27,13,934 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,65,302 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక శనివారం ఒక్కరోజే గరిష్టంగా 10,55,027 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 4,14,61,636 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.