Coronavirus: దేశంలో తగ్గిన పాజిటివ్‌ కేసులు | Coronavirus: 44111 New Corona Positive Cases Registered In India | Sakshi
Sakshi News home page

Coronavirus: దేశంలో తగ్గిన పాజిటివ్‌ కేసులు

Jul 3 2021 11:35 AM | Updated on Jul 3 2021 11:38 AM

Coronavirus: 44111 New Corona Positive Cases Registered In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో దేశంలో మొత్తం ​కోవిడ్‌ కేసుల సంఖ్య 3,05,02,362 చేరింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 738 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 4,01,050 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.

గడిచిన 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల నుంచి 57,477 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోవిడ్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,96,05,779 చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,95,533 ఉన్నాయి. ఇప్పటివరకు 34,46,11,291 మందికి కరోనా టీకా అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement