ఒక్క క్షణికావేశం.. జీవితంలో 37 ఏళ్లు నాశనమయ్యాయి! | The convict who walked free after 37 years | Sakshi
Sakshi News home page

ఒక్క క్షణికావేశం.. జీవితంలో 37 ఏళ్లు నాశనమయ్యాయి!

Jul 6 2026 12:08 PM | Updated on Jul 6 2026 12:52 PM

The convict who walked free after 37 years

బెంగళూరు: స్రత్పవర్తన ఆధారంగా రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి శనివారం 24 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో తొమ్మిది మంది బెంగళూరు నగరంలోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు.  తొందరపాటు నిర్ణయంతో నేరాలకు పాల్పడిన వీరు 14 ఏళ్లపాటు జైలు గోడల మధ్య గడిపారు. స్రత్పవర్తన ఆధారంగా జైలు నుంచి విడుదలయ్యారు. తెలిసో తెలియక నేరాలు చేసి జైలు జీవితం గడిపామని, క్షణికావేశంలో ఎవరూ నేరాలు చేయరాదని విడుదలైన పలువురు ఖైదీలు పేర్కొన్నారు.

 చిక్కమగళూరు వాసి మణికంఠ మాట్లాడుతూ హత్య కేసులో జైలు పాలై  15 ఏళ్ల పాటు యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాన్నారు. క్షణికావేశంలో  ఎవరూ నేరపూరిత చర్యలలో పాల్గొనకూడదన్నారు. మూడు హత్య కేసుల్లో 37 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన జీవర్గికి చెందిన సైబన్న లింగప్ప నట్టికర్‌ అనే వృద్ధుడు కూడా జైలు నుంచి విడుదలయ్యాడు. ఇన్నాళ్లూ జైలు గొడల మధ్య గడిపిన వారు కారాగారం నుంచి బయటకు వచ్చిన తర్వాత సంతోషం వ్యక్తం చేశారు. జైలు వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement