
ఢిల్లీ: చమురు, గ్యాస్ ధరల పెరుగుదలపై కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టింది. వరుసగా పెట్రో ధరలను పెంచడంపై కాంగ్రెస్ పార్టీ నిరసనను తీవ్రతరం చేసింది. దీనిలో భాగంగా ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఎంపీలతో కలిసి ధర్నాలో రాహుల్ పాల్గొన్నారు.
ఈ మేరకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. చమురు ధరలు 10 రోజుల్లో9సార్లు పెరిగాయి. ధరల పెరుగుదలను కేంద్రం నియంత్రించాలి. తక్షణమే పెట్రో ధరలను తగ్గించాలి’ అని డిమాండ్ చేశారు.