వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు | Congress MLA Arrested In Guwahati Over Derogatory Remarks Against Hindus | Sakshi
Sakshi News home page

వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు

Published Wed, Nov 8 2023 11:40 AM | Last Updated on Wed, Nov 8 2023 12:12 PM

Congress MLA Arrested In Guwahati Over Derogatory Remarks Against Hindus - Sakshi

గౌహతి: మతపరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అఫ్తాబ్ ఉద్దీన్ మొల్లా(Aftab Uddin Mollah)ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గౌహతిలో ఎమ్మెల్యే వాజెద్ అలీ చౌదరి నివాసం నుంచి మొల్లాను అరెస్టు చేశారు.

గోల్‌పారా జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో హిందువులు, పూజారులపై మొల్లా తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాస్పద  వ్యాఖ్యలపై మొల్లాకు అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చింది.  మొల్లా అభ్యంతకర వ్యాఖ్యలపై డిస్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది.  

ఇదీ చదవండి: జనాభా నియంత్రణపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement