కాంగ్రెస్‌ నేతలవి సినిమా డైలాగులు : ప్రధాని మోదీ | congress leaders dialogues are family says pm modi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలవి సినిమా డైలాగులు : ప్రధాని మోదీ

Nov 4 2023 6:39 PM | Updated on Nov 4 2023 8:00 PM

congress leaders dialogues are family says pm modi - Sakshi

రాట్లం: కాంగ్రెస్‌ పార్టీ నేతలపై ప్రధాని మోదీ సెటైర్ల మీద సెటైర్లు వేశారు. శనివారం మధ్యప్రదేశ్‌ రాట్లంలో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతల డైలాగులు, ప్రకటనలు,వారి క్యారెక్టర్‌లు అన్నీ సినిమా తరహాలోనే ఉంటాయని చమత్కరించారు. 

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో బట్టలు చింపుకునే పోటీ జరుగుతోందని మోదీ అన్నారు. డిసెంబర్‌3న ఎన్నికల రిజల్ట్ రాగానే ఇది మరింత తీవ్రం అవుతుందని చెప్పారు.కాంగ్రెస్‌ నేతలకు చాన్సిస్తే ప్రజల ఒంటి మీద కూడా బట్టలు చింపేస్తారని హెచ్చరించారు. 

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ నేతలు సీఎం కుర్చీ కోసం కొట్టుకోవడం లేదన్నారు పీఎం మోదీ. వాళ్లు వారి కొడుకుల కోసం కొట్టుకుంటున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఎవరి కొడుకు కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టాలనేది వారి తపన అని ఎద్దేవా చేశారు.కాగా, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో ఇద్దరు అగ్రనేతలు కమల్‌నాథ్‌, దిగ్విజయసింగ్‌ మధ్య అంతర్గత పోరు జరుగుతున్నవిషయం తెలిసిందే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement