రాహులే భద్రతా నిబంధనలు ఉల్లంఘించారు: సీఆర్‌పీఎఫ్ | Sakshi
Sakshi News home page

రాహుల్ భద్రతపై కాంగ్రెస్ లేఖ.. సీఆర్‌పీఎఫ్ రిప్లై.. ఆయనే నిబంధనలు ఉల్లంఘించారు..

Published Thu, Dec 29 2022 2:15 PM

Congress Flags Rahul Gandhi Security To Amit Shah CRPF Replies  - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఢిల్లీలో పర్యటించినప్పుడు సరైన భద్రత కల్పించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కాంగ్రెస్ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కేంద్ర పారామిలిటరీ దళం(సీఆర్‌పీఎఫ్) స్పందించింది. రాహుల్ గాంధీనే భద్రతా నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది.

ఢిల్లీ పోలీసులు, ఇతర సెక్యూరిటీ సంస్థలతో కలిసి రాహుల్ పర్యటను తామే భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఆర్‌పీఎఫ్ పేర్కొంది. అన్ని మార్గదర్శకాలను పాటించినట్లు చెప్పింది.  అవసరమైన సిబ్బందిని మోహరించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారని పేర్కొంది.

డిసెంబర్ 24 పర్యటనలో రాహుల్ గాంధీనే తరచూ భద్రగా నిబంధనలు ఉల్లంఘించారని సీఆర్‌పీఎఫ్ పేర్కొంది. ఈ విషయాన్ని ఆయనకు పదే పదే చెప్పినట్లు వివరించింది.

రాహుల్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్.. అమిత్ షాకు బుధవారం లేఖ రాశారు. ఈ మరునాడే సీఆర్‌పీఎఫ్ ఈ విషయంపై స్పదించింది.
చదవండి: 'నా భర్త గే.. ఎంత ట్రై చేసినా దగ్గరకు రానివ్వట్లేదు..' కోర్టు కీలక తీర్పు

Advertisement
 
Advertisement
 
Advertisement