Happy Birthday MK stalin: CM Jagan and KCR Birthday Wishes to Tamil Nadu CM - Sakshi
Sakshi News home page

MK stalin Birthday: ఎంకే స్టాలిన్‌కు సీఎం జగన్‌, కేసీఆర్‌ బర్త్‌డే విషెష్‌

Mar 1 2022 5:29 PM | Updated on Mar 1 2022 5:56 PM

CM Jagan and KCR Birthday Wishes to Tamilnadu CM MK stalin - Sakshi

సాక్షి, అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.

తమిళనాడు సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌
ఢిల్లీ: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌.. సీఎం స్టాలిన్‌కు ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కొద్ది రోజుల క్రితం తమిళనాడులో పర్యటించి జాతీయ రాజకీయాలపై సీఎం స్టాలిన్‌తో కేసీఆర్‌ సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసిందే.

చదవండి: (టీడీపీ అభ్యర్థిగా వివేకా కుమార్తె అని ప్రచారంలో ఉంది: సజ్జల) 

Advertisement
 
Advertisement
Advertisement