లైంగికవేధింపుల కేసు: యడ్యూరప్పకు నోటీసులు | CID Issues Notice To BJP Leader Yediyurappa In POCSO Case | Sakshi
Sakshi News home page

లైంగికవేధింపుల కేసు: యడ్యూరప్పకు నోటీసులు

Published Wed, Jun 12 2024 7:16 PM | Last Updated on Wed, Jun 12 2024 7:48 PM

Cid Notices To Former Cm Yediyurappa

బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత యడ్యూరప్పకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బాలికను లైంగికంగా వేధించిన  కేసులో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో కోరారు. 

అయితే తాను ఢిల్లీలో ఉండటం వల్ల విచారణకు రాలేకపోతున్నానని వచ్చిన వెంటనే హాజరవుతానని యడ్యూరప్ప పోలీసులకు సమాధానమిచ్చారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన కూతురుతో కలిసి యడ్యూరప్పకు ఇంటికి వెళ్లినపుడు ఆయన తన కూతరుపై అత్యాచారం చేశారని 17 ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ వ్యవహారంలో పోలీసులు యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికేవ ఈ కేసులో యడ్యూరప్ప పోలీసుల ఎదుట విచారణకు మూడుసార్లు హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement