పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న రాజ్‌పురాలోని చిత్కారా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో దెయ్యం తిరుగుతోందంటూ, అమ్మాయిల హాస్టల్ నుంచి కేకలు వినిపించాయంటూ ఒక వీడియో వైరల్ కావడం కలకలం రేగింది. క్యాంపస్‌లో విద్యార్థినులు మరణిస్తున్నారని లేదా క్యాంపస్‌లో అదృశ్యమవుతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. దీంతో శుక్రవారం రాత్రి వందలాది మంది విద్యార్థులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొందరు ఆందోళనకారులు పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ధ్వంసం చేశారు. అసలు ఏమైందంటే..
పుకార్ల వెనుక అసలు నిజం
క్యాంపస్‌లో దెయ్యం తిరుగుతోందంటూ, అమ్మాయిల హాస్టల్ నుంచి కేకలు వినిపించాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. దెయ్యం పట్టిన కారణంగా క్యాంపస్‌లోని ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారని ఆరోపించారు. అంతేకాదు దెయ్యాలను తరిమి కొట్టడానికి అధికారులు రహస్యంగా ఒక మాంత్రికుడిని హాస్టల్‌కు పిలిపించారనీ, ఈ మొత్తం విషయాన్ని కప్పిపుచ్చుతున్నారంటూ నిరసనలకు దిగారు.
Big News 🚨
The videos circulating from Chitkara University last night show protests sparked.
Both the university administration and Punjab Police have investigated the claims and officially confirmed that no students have died or gone missing. pic.twitter.com/JVUjuh0Mho— Sambhawam🚩 (@hinduvision1) September 26, 2026
హాస్టల్ వద్ద కనిపించిన అంబులెన్స్, ఆసుపత్రి నుంచి తిరిగి వస్తున్న ఒక విద్యార్థిని కోసం వచ్చిందే తప్ప మరే ఇతర కారణం వల్ల కాదని తేలింది. అలాగే హాస్టల్ వద్ద కనిపించిన పూజారి (పండిత్ జీ), తన కూతురిని కలవడానికి వచ్చారే తప్ప, ఏ ఘటనతోనూ ఆయనకు సంబంధం లేదని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. ఇద్దరు విద్యార్థినులు కనిపించడం లేదంటూ విద్యార్థులు ఫిర్యాదు చేశారని, అయితే ఎవరి పేర్లు లేదా వివరాలు ఎవరికీ తెలియవని బనూర్ డీఎస్పీ సుఖదేవ్ సింగ్ తెలిపారు. అయినప్పటికీ ఈ వార్తలపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: నో ఫుడ్..రోజుకో షవర్మ....ఇపుడు రూ. 1.04 కోట్లు
అయితే క్యాంపస్‌లో ఎలాంటి ఆత్మహత్యలు లేదా మరణాలు జరగలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని యూనివర్సిటీ క్లారిటీ ఇచ్చింది. అలాగే ధృవీకరించని రీల్స్, సందేశాలు లేదా పోస్ట్‌లపై ఆధారపడవద్దని విశ్వవిద్యాలయం విద్యార్థులను కోరింది.
గతంలోనూ ఇలాంటి పుకార్లు
2019 డిసెంబర్‌లో కూడా ఇదే యూనివర్సిటీలో ఇలాంటిదే ఒక నకిలీ వార్త ప్రచారమైంది. కొందరు విద్యార్థులు ప్రాంక్ కాల్ చేసి హాస్టల్‌లోవిద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ పుకార్లు రేపడంతో ఆందోళనకు దారి తీసింది. పోలీసులు క్యాంపస్‌కు హుటాహుటిన చేరుకుని, ఆ కాల్ బూటకమని నిర్ధారించారు.
ఇదీ చదవండి: యూనివర్శిటీ విద్యార్థిని మృతి, లవ్ జిహాద్ ఆరోపణలు కలకలం


