భారత్‌లో ఆక్వా రంగాన్ని దెబ్బతీయాలని చైనా కుట్ర

China Conspires To Damage Aqua Sector In India Over Export Ban - Sakshi

సాక్షి, అమరావతి: భారత్‌లో ఆక్వా రంగాన్ని దెబ్బతీయాలని చైనా కుట్ర చేస్తోంది. భారత్ నుంచి చైనాకు ఎగుమతి అయ్యే ష్రింప్ ప్యాకింగ్‌పై కరోనా అవశేషాలు ఉన్నాయంటూ కుంటి సాకులు వెతుకుతోంది.. కరోనా వైరస్‌ను కారణంగా చూపుతూ చైనా వారానికి ఐదు నుంచి ఏడు ఆక్వా కంపెనీలను డీలిస్టింగ్ చేస్తోంది. అదీకాక వర్చువల్ ఆడిట్ పేరుతో కంపెనీలపై బ్యాన్ విధిస్తోంది. ఆక్వా ఇండియా ఎకానమీపై చైనా అధ్యక్షుడు జిన్ పిన్ కుతంత్రం చేస్తున్నాడు. చైనా నిర్ణయంతో పలు రాష్ట్రాలు, ఏపీలోని ష్రింప్‌ ఎగుమతిదారుల్లో ఆందోళన నెలకొంది.

ఈ వ్యవహారంపై సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపీఈడీఏ), కేంద్రం జోక్యం చేసుకోవాలని ఎగుమతి దారులు కోరుతున్నారు. ఏపీలోని భీమవరం కేంద్రంగా భారీగా ష్రింప్ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీలు యాంటీ వైరస్ టెస్టులు చేసినా చైనా వెనక్కి పంపుతోందటూ వ్యాపారులు తెలిపారు. భారత్ నుంచి ప్రతి ఏడాది 30 నుంచి 40 వేల కోట్ల అక్వా ఉత్పత్తులు ఆమెరికా, చైనా, యూరప్‌ దేశాలకు ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. చైనా 58 కంపెనీలు సస్పెండ్ చేయగా 16  కంపెనీలు డీలిస్టింగ్ చేసింది. భారత్‌కు చెందిన రూ. 1200 కోట్ల దిగుమతులు,1000 కంటైనర్లు చైనా పోర్టుల్లో నిలిచిపోయాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top