Chhattisgarh Naxals Encounter: చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Chhattisgarh: Two Naxalites Killed in Police Encounter In Sukma - Sakshi

రాయ్‌పూర్‌: చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మహిళ సహా ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. జిల్లాలోని భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేష్‌పురం అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు(ఐఈడీ), ఆటోమేటిక్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది.

డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొన్న సమయంలో కాల్పులు జరిగినట్లు సుక్మా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ శర్మ తెలిపారు. డీఆర్‌జీ జవాన్లపై నక్సలైట్లు కాల్పులు జరిపారని, ఆ తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. చెప్పారు. జవాన్ల చేతిలో హతమైన మావోయిస్టులను గొల్లపల్లి ఎస్‌ఓఎస్‌ కమాండర్‌ మద్కమ్‌, ఆయన భార్య పొడియం భీమ్‌గా గుర్తించారు. మద్కమ్‌పై  రూ 8 లక్షల రివార్డు ఉండగా.. ఆయన భార్యపై రూ. 3లక్షల రివార్డు ఉన్నట్లు పేర్కొన్నారు.
చదవండి: Karnataka Elections: తెలుగువారి ప్రభావమున్న జిల్లాలో ఎవరిది పైచేయి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top