చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు | Chandigarh Poll Recount 8 Invalidated Votes To Be Counted: Supreme Court | Sakshi
Sakshi News home page

చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Feb 20 2024 4:04 PM | Updated on Feb 20 2024 5:52 PM

Chandigarh Poll Recount 8 Invalidated Votes To Be Counted: Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిట్ర్నింగ్‌ అధికారి చట్ట విరుద్దంగా వ్యహరించారన్న సర్వోన్నత న్యాయస్థానం .. ఆప్‌ కౌన్సిలర్‌ కుల్దీప్‌ కుమార్‌ను చండీగఢ్‌ మేయర్‌గా ప్రకటించింది.  

మేయర్ఎ‌ న్నికలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ డీవీ చంద్రచూడ్‌ నేతృత్వంలోని జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారిపై తీవ్రంగా విరుచుకుపడింది. ఉద్దేశపూర్వకంగానే అనిల్ మసీహ్‌ 8 బ్యాలెట్ పేపర్లను కొట్టివేశారని మండిపడింది. 

అంతకముందు మేయర్‌ ఎన్నికల ఓట్లను రీకౌంటింగ్‌ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రిటర్నింగ్‌ అధికారి చెల్లని ఓట్లుగా ప్రకటించి పక్కకు పెట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎనిమిది బ్యాలెట్‌ పేపర్లను కూడా లెక్కించాలని ఆదేశించింది. ఈ మేరకు చెల్లుబాటు కాని ఎనిమిది బ్యాలెట్‌ పత్రాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. అనంతరం  ఆ 8 ఓట్లను కూడా లెక్కలోకి తీసుకుని.. వాటితో కలిపి మరోసారి మొత్తం ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని చండీగఢ్ మేయర్‌గా ప్రకటించాలని తెలిపింది. తాజాగా ఆప్‌ అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ను చండీగఢ్‌ మేయర్‌గా ప్రకటించడంతో ఈవివాదానికి తెరపడింది.

చదవండి: పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట

కాగా జ‌న‌వ‌రి 30న జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ క‌మార్‌ను ఓడించి మనోజ్‌ సోంకర్‌  మేయ‌ర్‌గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్‌కు సంబంధించి ఉమ్మ‌డి అభ్య‌ర్ధి కుల్దీప్ సింగ్‌కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్‌ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మసీహ్‌ ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థి మ‌నోజ్ సోంక‌ర్ విజయం సాధించారు.

ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్‌ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. బ్యాలెట్‌ పేపర్లను మార్కింగ్‌ చేస్తూ రిటర్నింగ్‌ అధికారి అనిల్‌ మసీహ్‌ కెమెరాకు చిక్కారు. దీంతో ఆప్‌ కౌన్సిలర్‌ సుప్రీంను ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో విచార‌ణ చేపట్టిన నేపథ్యంలో ఆదివారం సోంక‌ర్ మేయర్‌ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement