సినిమా షూటింగ్‌లకు కేంద్రం అనుమతి | Sakshi
Sakshi News home page

థియేటర్లు తెరిచేందుకు కేం‍ద్రం అనుమతి

Published Sun, Aug 23 2020 12:23 PM

Central Government Give Permission To Movie Shootings - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో మూతపడ్డ థియేటర్లు, మార్కెట్లను కనీస జాగ్రత్తలు పాటిస్తూ తెరిచేందుకు కేంద్రం ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్‌-3 ఆగస్టు 31తో ముగియనున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా సినిమా షూటింగ్‌లకు కేంద్రం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు కేంద్రం అనుమతి ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌లు జరుపుకోవాలని అనుమతులు జారీ చేసింది. (పంజాబ్ ప్ర‌భుత్వం: బ్రేక్‌ పడిన సినిమా షూటింగుల‌కు అనుమ‌తి!)

షూటింగ్‌ దగ్గర ప్రతి ఒక్కరూ మాస్క్‌ పెట్టుకోవాలని సూచించింది. ఇక చిత్రీకరణ ప్రదేశంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. చిత్రీకరణలో పాల్గొనే నటీనటులు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాలని సూచించింది. సినిమా షూటింగ్ సమయంలో విజిటర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని కేంద్రం ఆదేశించింది. హెయిర్ స్టైలిస్ట్‌లు, మేకప్‌ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలని పేర్కొంది. కాస్ట్యూమ్స్‌, లోకల్ మైక్‌లను ఎవరికి వారే ఉపయోగించుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది.

Advertisement
Advertisement