సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

CBSE Board Exam 2021 Class 10 and Class 12 Time Table Released - Sakshi

న్యూఢిల్లీ: సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క సెంట్రల్ బోర్డ్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతులకు సంబందించిన పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2020-2021 విద్యా సంవత్సారానికి సంబంధించి 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ ఫోక్రియాల్‌ నిషాంక్ నేడు ట్విటర్‌లో ప్రకటించారు. ఈ పరీక్షలు మే 4 నుంచి జూన్ 10 వరకు జరగనున్నాయి.(చదవండి: ఆధార్ సేవా కేంద్రాల కోసం హెల్ప్‌లైన్)

షెడ్యూల్:

  • మే 4 నుంచి జూన్‌ 7 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి
  • మే 4 నుంచి జూన్‌ 11 వరకు 12వ తరగతి పరీక్షలు జరగనున్నాయి
  • మార్చి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు
  • జులై 15 తేదీలోగా సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల 

పదో తరగతి పరీక్షలు రోజూ ఉదయం 10.30గం నుంచి మధ్యాహ్నం 1.30గం  వరకు కొనసాగనున్నాయి. అలాగే, 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నారు. తొలి షిఫ్ట్‌ ఉదయం 10.30గం నుంచి 1.30గం వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2.30గం నుంచి 5.30గం వరకు నిర్వహిస్తారు. మహమ్మారి కారణంగా10, 12 తరగతుల సిలబస్‌ను 30 శాతం తగ్గించారు. కోవిడ్-19 పాండమిక్ ప్రోటోకాల్స్‌ను అనుసరించి పరీక్షలు జరుగుతాయి. ఫేస్ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. మరిన్ని వివరాల కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.inను వీక్షించండి.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top