ఆధార్ సేవా కేంద్రాల కోసం హెల్ప్‌లైన్

UIDAIs big Aadhaar Card Update Just Dial This Helpline Number - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల కోసం అందిస్తున్న సేవలను చాలావరకు డిజిటల్ విధానంలోకి మారుస్తుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కూడా తన ఆధార్ సేవలను డిజిటల్ రూపంలోకి మార్చింది. తాజాగా మరికొన్ని సేవలను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ప్రజలు ఇంటి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఆధార్‌ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. కొన్ని సేవల కోసం తప్పని సరిగా దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రాల వద్దకు వెళ్లాలని సూచించింది. మీ దగ్గరలోని ఆధార్ సేవ కేంద్రం తెలుసుకోవడం కోసం ప్రజలు 1947 ఆధార్ హెల్ప్‌లైన్ నంబర్‌ను డయల్ చేసి దగ్గర్లో ఉన్న ఆధార్ సేవా కేంద్రాల అడ్రస్ తెలుసుకోవచ్చు అని తాజా ట్వీట్‌లో యుఐడిఎఐ తెలిపింది. అలాగే ఎమ్-ఆధార్ యాప్‌ను కూడా వాడుకోవచ్చని యూఐడీఏఐ ట్వీట్ చేసింది.(చదవండి: అమెరికాను గడగడలాడించిన హ్యాకర్?)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top