ఫిబ్రవరి 17 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు | CBSE board exams 2026 class 10, 12 will begin on 17 February 2025 | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 17 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు

Sep 25 2025 6:17 AM | Updated on Sep 25 2025 6:17 AM

CBSE board exams 2026 class 10, 12 will begin on 17 February 2025

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. కీలకమైన ఈ పరీక్షలకు తాత్కాలిక టైమ్‌ టేబుల్‌ను బుధవారం ప్రకటించింది.

 ఒకే విద్యాసంవత్సరంలో పదో తరగతికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సీబీఎస్‌ఈ నిర్వహించబోయే మొదటి పరీక్ష ఇదే కావడం గమనార్హం. పరీక్షల మొదటి ఎడిషన్‌ 2026 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6వ తేదీ వరకు, రెండో ఎడిషన్‌ షెడ్యూల్‌ మే 15 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు ఉంటుందని సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ సన్యమ్‌ భరద్వాజ్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement