Brawl Between Two Girls In Rajkot Video Viral - Sakshi
Sakshi News home page

ఇదేం ఫైటింగ్‌.. డ్రెస్‌లు పట్టుకుని చిత్తకొట్టుకున్నారు.. మధ్యలో వెళ్లిన.. 

Jul 8 2023 8:52 PM | Updated on Jul 8 2023 8:57 PM

Brawl Between Two Girls In Rajkot Video Viral - Sakshi

కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాల కారణంగా ఆవేశానికిలోనై ఎదుటి వారితో తీవ్ర వాగ్వాదానికి దిగుతాం. ఆ గొడవ కాస్తా పెద్దది అయితే ఫైటింగ్‌ కూడా జరుగుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌లో చోటుచేసుకుంది. చిన్న విషయానికే ఇద్దరు యువతులు రోడ్డుమీద హంగామా చేశారు. అందరూ చూస్తున్నారనే విషయం మరిచిపోయి ఫైటింగ్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఇద్దరు యువతులు నడిరోడ్డుపై తన్నుకున్నారు. అయితే, ఒకరి వాహనాన్ని మరొకరు ఓవర్‌ టేక్‌ విషయంలో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం.. రోడ్డుమీదనే వాళ్లు కొట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వారి వీడదీసే ప్రయత్నం చేసిన మరో యువకుడిపై ఓ యువతి దాడికి ప్రయత్నించింది. నీకెందుకు అన్న విధంగా అతడికి కూడా కొట్టే ప్రయత్నం చేసింది. ఇక, ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిద్దరీని విడిపించారు. అనంతరం, అక్కడున్న వారిని చెదరగొట్టారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఇది కూడా చదవండి: వరద బీభత్సం.. ప్రాణాల కోసం పోరాటం..

Advertisement
 
Advertisement
Advertisement