దారుణం: గతేడాది కోవిడ్‌తో చనిపోతే.. ఇప్పుడు మృతదేహాలు అప్పగింత!

Bodies of Two COVID 19 Victims Found in Bengaluru Mortuary After 15 Months - Sakshi

బెంగళూరు:  ఏడాది క్రితం కరోనా మహమ్మారి కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన రెండు కుటుంబాలకు బెంగళూరులోని రాజాజి ఆసుపత్రి నుంచి ఊహించని షాక్‌ ఎదురైంది. అయితే తమ ప్రియమైన వ్యక్తులు కరోనా బారినపడి చనిపోయిన ఏడాది తర్వాత మీ సంబంధికుల మృతదేహాలు ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయంటూ ఆసుపత్రి సిబ్బంది నుంచి కాల్‌ వచ్చింది. దాంతో సదరు కుటుంబ సభ్యులు అయోమయానికి గురి కావడమే కాక అసలు విషయం తెలుసుకుని షాక్‌కి గురయ్యారు.

(చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!)

అయితే నిజానికి ఆ మృతులు దుర్గా సుమిత్ర (40), మునిరాజు (50) గతేడాది కరోనాతో మృతిచెందారు. అంతేకాక బెంగళూరులోని రాజాజీనగర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మోడల్‌ ఆస్పత్రి సర్టిఫికేట్లలో గతేడాది జూలై 2, 2020న మరణించినట్లు మరణ ధృవీకరణ పత్రాలు కూడ ఇచ్చింది. పైగా ఆ సమయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృభించడంతో ఆస్పత్రి సిబ్బంది మృతదేహాలను ఇవ్వమని చెప్పారు. ఈ మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) ఆ మృత దేహాలకు దహన సంస్కారాలు నిర్వహించాం అని కూడా ఆయా బాధిత కుటుంబాలకు  తెలియజేసింది.

అయితే ఇటీవలే మూడురోజుల క్రితం బాధిత కుటుంబాలకి మీ వాళ్ల మృతదేహాలు మార్చురీలో ఉన్నాయంటూ సదరు ఆసుపత్రి సిబ్బంది  సమాచారం అందించింది. అయితే సదరు బాధిత కుటుంబాలు తాము మొదటగా నమ్మలేదని ఆసుపత్రికి వెళ్తే అసలు విషయం తెలిసిందని అంటున్నారు. దీంతో ఆయా బాధిత కుటుంబాలు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష వైఖరి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మేరకు సదరు ఆస్పత్రి ఆధికారులు సిబ్బంది పై చర్యలు తీసుకోవడమే కాక అసలు ఇది ఎలా జరిగిందో దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

(చదవండి: దూషించొద్దు అన్నందుకు స్నేహితులే హత్య చేశారు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top