జాతికి కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ

BJP Slams Kejriwal Government Over SC Panel Report On Oxygen - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆక్సిజన్‌ సిలిండర్ల వినియోగంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పత్ర ఆరోపించారు. కేజ్రివాల్‌ అబద్ధాలతో ఇతర రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయని మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా, సెకండ్‌ వేవ్‌ సందర్బంగా ఢిల్లీ ప్రభుత్వం అవసరమైన ఆక్సిజన్‌ కంటే నాలుగు రెట్లు ఎక్కువ డిమాండ్‌ చేసిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్‌ ప్యానెల్‌ తేల్చింది.  ఏప్రిల్‌, మే నెలలో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ సిలిండర్లు ఢిల్లీకి అందాయని, రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేసిన మేరకు ఇతర రాష్ట్రాలకు తగ్గించి మరీ ఢిల్లీకి సరఫరా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఢిల్లీకి 300 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవరసం ఉండగా.. ప్రభుత్వం 1200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను డిమాండ్‌ చేసిందని పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top