బర్డ్‌ఫ్లూ: పక్షులనుంచి మనుషులకు వస్తుందా?

Bird Flu Can Spread To Humans Here It Is The Truth - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వైరస్‌ పక్షులనుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు సోకే అవాకాశం చాలా అరుదని ప్రముఖ ఢిల్లీ వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉడికీ ఉడకని చికెన్‌ తినటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. బర్డ్‌ఫ్లూ సోకిన పక్షుల లాలాజలం, వ్యర్ధాల ద్వారా మనషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు. కలుషిత ప్రదేశాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. గాల్లో ఉన్న వైరస్‌ను పీల్చటం ద్వారా, వైరస్‌తో కలుషితమైన ప్రదేశాలను ‌ తాకి ఆ వెంటనే ముక్కు, కళ్లను ముట్టుకోవటం ద్వారా ఈ వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుందని సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తెలిపింది. ( అది బర్డ్‌ఫ్లూ కాదు..)

జ్వరం, దగ్గు, గొంతునొప్పి, కారే ముక్కు, ఒంటి నొప్పులు, తల నొప్పి, కళ్లు ఎర్రగా అవ్వటం వంటివి వైరస్‌ లక్షణాలుగా పేర్కొంది. ఇది మామూలు జలుబు లాంటిదేనని, కానీ, కొంతమందికి ఎక్కువ ప్రమాదకారిగా మారుతుందని తెలిపింది. గర్భిణులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, 65 సంవత్సరాల వయసు పైబడ్డవారికి ఎక్కువ నష్టం కలుగుతుందని వెల్లడించింది. ఈ వైరస్‌పై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పల్మనరీ, క్రిటికల్‌ కేర్‌ అండ్‌ స్లీప్‌ మెడిసిన్‌ యాట్‌ పోర్టిస్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జేసీ సూరి మాట్లాడుతూ.. ‘‘ కోళ్ల ఫారాలలో పనిచేసేవారు పీపీఈ కిట్లు ధరించాలి. గ్లోజులు కూడా ధరించాలి. ఎప్పటికప్పుడు కలుషిత ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేసుకోవాలి’’ అని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top