‘ఔకత్’ వ్యాఖ్యలపై స్పందించిన బిహర్‌ పోలీస్‌ చీఫ్‌

Bihar Top Cop Explains Aukat Remark On Rhea Chakraborty - Sakshi

పట్నా: రియా చక్రవర్తిని ఉద్దేశిస్తూ.. బిహార్‌ పోలీసు ఉన్నతాధికారి చేసిన ఔకత్‌ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ను విమర్శించడంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన వెల్లడించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తండ్రి బిహార్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ దర్యాప్తులో రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయంటూ నితీష్‌ కుమార్‌ను ఉద్దేశిస్తూ రియా చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై బిహార్‌ పోలీసు ఉన్నతాధాకారి గుప్తేశ్వర్‌ పాండే స్పందిస్తూ.. రియాకు నితీష్‌ కుమార్‌ గురించి మాట్లాడే అర్హత లేదంటూ ట్వీట్‌ చేశారు. ఇది కాస్తా వివాదాస్పదంగా మారడంతో ఆయన వివరణ ఇచ్చారు. (రియాకు షాక్ : ‘విజయానికి తొలి అడుగు’ )

ఈ సందర్భంగా గుప్తేశ్వర్‌ పాండే మాట్లాడుతూ.. ‘‘ఔకత్‌’ అంటే స్థాయి, అర్హత అనే అర్థాలు వస్తాయి. బిహార్‌ ముఖ్యమంత్రి గురించి వ్యాఖ్యానించే అర్హత రియాకు లేదు. ముఖ్యంగా ఆమె ఓ విషయం మర్చిపోతున్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో ఆమె పేరును నిందితురాలిగా చేర్చారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గురించి వ్యాఖ్యనించడంతోనే నేను స్పందించాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మేం పట్టించుకోం. కానీ ఓ నిందితుడు బిహార్‌ సీఎం గురించి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం. ఆమె చట్టబద్దంగా  పోరాటం చేయాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు’ అన్నారు గుపప్తేశ్వర్‌ పాండే. సుశాంత్ మృతి కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ బుధవారం సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుశాంత్‌ కుటుంబ సభ్యులతో పాటు బిహార్‌ ప్రభుత్వం, పోలీసులు హార్షం వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top