టీచర్‌ దండన.. విలవిలలాడిన చిన్నారి | Bihar Teacher Mercilessly Thrashes Boy Loses Consciousness Viral | Sakshi
Sakshi News home page

కర్కశకంగా కోటింగ్‌.. దెబ్బలు తాళలేక స్పృహ కోల్పోయిన చిన్నారి

Published Mon, Jul 4 2022 3:25 PM | Last Updated on Mon, Jul 4 2022 7:37 PM

Bihar Teacher Mercilessly Thrashes Boy Loses Consciousness Viral - Sakshi

చిన్నతప్పుకే ఐదేళ్ల పిలగాడిని చచ్చేంతలా కొట్టాడు ఓ టీచర్‌..

దండిస్తే.. పిల్లలు క్రమశిక్షణ తప్పరు, సరిగా చదువుతారనేది ఒకప్పడు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అయితే పిల్లల్ని దండించడంలో మాత్రం చాలాదూరం వెళ్లాడు ఇక్కడో టీచర్‌. అతను పెట్టిన హింసతో ఆస్పత్రి పాలయ్యాడు ఓ విద్యార్థి.

ఐదేళ్ల పిలగాడిని ఓ టీచర్‌ దారుణాతిదారుణంగా హింసించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ముందుగా ఓ కర్రతో పిల్లాడిని బాదిన టీచర్‌.. అది విరిగిపోయినా ఊరుకోకుండా రెచ్చిపోయాడు. చెంపదెబ్బలు కొడుతూ.. జుట్టు లాగేస్తూ  పిడిగుద్దులతో స్టూడెంట్‌పై విరుచుకుపడ్డాడు. తనని వదలమని ఆ పిలగాడు రోదిస్తూ ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. 

కిందపడిపోయిన ఆ స్టూడెంట్‌ను.. కనికరం లేకుండా హింసించాడు ఆ టీచర్‌. ఇదంతా మిగతా పిల్లలు భయంభయంగానే చూస్తూ ఉండిపోయారు. స్పృహ తప్పిపోయిన ఆ పిల్లాడిని.. ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన స్థానికులు కోచింగ్‌ సెంటర్‌పై పడి టీచర్‌ ​చోటూను చితకబాదేశారు. చిన్నతప్పిదానికే అలా హింసించాడని తోటి స్టూడెంట్స్‌ చెప్తుండగా..  బీపీ వల్లే ఆ టీచర్‌ అలా దాడి చేశాడంటూ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు సమర్థించడం కొసమెరుపు.  

బీహార్‌ రాజధాని పాట్నాలోని Dhanarua బ్లాక్‌లో.. జయ కోటించ్‌ క్లాసెస్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. సహనంగా పాఠాలు చెప్పాల్సిన వృత్తిలో అతనికి అర్హత లేదంటూ మండిపడుతున్నారు. ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. టీచర్‌పై చర్యలు తీసుకునేంత వరకు పిల్లల్ని కోచింగ్‌ సెంటర్‌కు పంపమని తల్లిదండ్రులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement