
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా సోకింది. గత నాలుగు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్‌కు వెళ్లినట్లు పేర్కొంది. గత నాలుగు రోజులుగా నితీశ్ కుమార్ అనారోగ్యానికి గురైనట్లు ఆరోగ్య శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ ప్రత్యాయ అమృత్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: MK Stalin Covid Positive: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కరోనా.. ట్విటర్ ద్వారా ప్రకటన