బతికుండగానే భార్యను తగులబెట్టాడు

In Bhiwandi a Husband beat his wife and Burnt her Alive - Sakshi

భివండీ (ముంబై): స్పృహ తప్పిన భార్యను బతికుండగానే తగలబెట్టాడు ఓ భర్త. ఈ సంఘటన స్థానిక తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసు కుంది. సంతోశ్‌ చౌరసియా తన భార్య కవిత  ఇద్దరు పిల్లలతో కలిసి చావింద్రలోని మహం కాళి దాబా ప్రక్కనే ఉన్న గుడిసెలో నివసిస్తున్నారు. కూలి పనిచేసే సంతోష్‌ వ్యసనాల కారణంగా పనికిపోక తరుచుగా భార్యతో గొడవ పడేవాడు.

మంగళవారం మద్యం సేవించిన సంతోశ్‌ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో ఆవేశంతో సంతోశ్‌ కవిత తలపై కర్రతో కొట్టడంతో ఆమె స్పహతప్పిపోయింది. దీంతో గుడిసె బయట నిల్వ చేసిన కర్రల కుప్ప దగ్గరకు కవితను లాకొచ్చి ప్రాణంతో ఉన్న కవితపై కట్టెలు పేర్చి నిప్పు అంటించి హత్యచేసి పారిపోయాడు.  పోలీసులు నిందుతున్ని అరెస్ట్‌ చేశారు. 

చదవండి: (పెళ్లయిన యువతికి తల్లిదండ్రులు మరో పెళ్లి.. భర్తకు తెలిసి..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top