పార్టీకి పిలిచి, మూకుమ్మడి అత్యాచారయత్నం | bengaluru Woman Incident | Sakshi
Sakshi News home page

పార్టీకి పిలిచి, మూకుమ్మడి అత్యాచారయత్నం

Jul 6 2026 12:20 PM | Updated on Jul 6 2026 12:55 PM

bengaluru Woman Incident

బెంగుళూరు: రాజధానిలో ఘోరం జరిగింది. ఒక యువతిపై సామూహిక అత్యాచారయత్నం జరిగిన సంఘటన తలఘట్టపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది, ఈ ఘటనలో ప్రధాన నిందితులు సోమశేఖర్‌, అంబరీష్‌లతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 

వివరాలు.. సెక్యూరిటీ ఏజెన్సీలో పని చేసే సోమశేఖర్‌ వద్దకు కలబుర్గి నుంచి నలుగురు స్నేహితులు వచ్చారు. దేవనహళ్లిలో ఉంటున్న తన స్నేహితురాలికి కాల్‌ చేసిన సోమశేఖర్‌, స్నేహితులు వచ్చారని, పార్టీకి రావాలని కోరాడు. సదరు యువతి వచ్చింది. అందరూ మద్యం తాగి విందు చేసుకున్నారు. ఈ సమయంలో అంబరీష్‌ యువతిపై అత్యాచారయత్నం చేశాడు. మిగతావారు అందుకు సహకరించారు. అదృష్టవశాత్తు ఆమె వారి నుంచి తప్పించుకుని 112 హెల్ప్‌లైన్‌కి కాల్‌ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement