
బెంగళూరు: రిజర్వేషన్లపై సోషల్ మీడియలో అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్యాకు బెంగళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు.
అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో తమ ముందు విచారణకు హాజరవ్వాలని సమన్లలో కోరారు. కాగా, ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వగా ఆయన తన రాతపూర్వక సమాధానాన్ని న్యాయవాది ద్వారా పంపారు.