అతీక్ అహ్మద్ హత్య: నా కుమారుడు డ్రగ్ అడిక్ట్.. అమ్మాయిని కొట్టి జైలుకు కూడా వెళ్లాడు.. ఏం పని చేయడు..

Atiq Ahmed Murder Accused Lovelesh Sunny Jobless Addicted To Drugs - Sakshi

లక్నో: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎమ్మెల్యే అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ శనివారం రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు, మీడియా ఎదుటే.. లవ్లేశ్‌ తివారీ, సన్నీ సింగ్‌, అరుణ్‌ మౌర్యగా అనే ముగ్గురు యువకులు వీరిని కాల్చి చంపారు. అనంతరం ఘటనా స్థలంలోనే పోలీసులకు లొంగిపోయారు.

అయితే నిందితుల్లో ఒకడైన లవ్లేశ్ తివారీ తండ్రి  యజ్ఞ తివారీ తన కుమారుడి గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ హత్య  ఘటనను టీవీలో చూశామని, అసలు తమ కుటుంబానికి ఏ విషయమూ తెలియదని పేర్కొన్నారు. లవ్లీష్ ఏ పనీ చేయకుండా బలదూర్‌గా తిరుగుతాడని, డ్రగ్స్‌కు బానిసయ్యాడని వెల్లడించారు. ఓ అమ్మాయిని కొట్టి జైలుకు కూడా వెళ్లొచ్చాడని, అతనిపై పోలీసు కేసు నమోదైందని చెప్పారు.

'ఈ ఘటనలో మాకు ఎలాంటి సంబంధం లేదు. అతడు మాకు ఏమీ చెప్పడు. చాలా కాలంగా ఇంట్లో ఉండటం లేదు. ఐదారు రోజుల క్రితం ఓసారి ఇంటికి వచ్చి వెళ్లాడు. కొన్ని సంవత్సారాలుగా అతనితో మేం మాట్లాడటం లేదు. ఓ కేసులో అతడు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. లవ్లేశ్ ఏ పనీ చేయడు డ్రగ్స్‌కు బాగా బానిసయ్యాడు. మాకు మొత్తం నలుగురు పిల్లలు.' అని యజ్ఞ తివారీ వివరించారు.

అతీక్ హత్య కేసులో మరో నిందితుడు సన్నీ సింగ్‌ సోదురుడు పింటు సింగ్‌ కూడా మీడియాతో మాట్లాడాడు. సన్నీ కూడా ఏ పనీ చేయకుండా రోడ్లపై తిరుగుతాడని వెల్లడించారు. అతను తమ నుంచి వేరుగా నివసిస్తున్నాడని, అసలు క్రిమినల్ ఎలా అయ్యాడో తమకు తెలియదని పేర్కొన్నాడు. ఈ ఘటన గురించి తమకు ఐడియా లేదని తెలిపాడు.
చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top