బెంగాల్‌ మినహా పూర్తయిన ఎన్నికలు.. పోలింగ్‌ శాతం ఇలా..

Assembly Elections: 3 States, One UT Polling Complete - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మంగళవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. ఈ క్రమంలో అత్యధికంగా ఈశాన్య రాష్ట్రం అసోంలో పోలింగ్‌ నమోదవగా, అత్యల్పంగా తమిళనాడులో పోలింగ్‌ జరిగింది. తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్‌ ముగిసింది.

అసోంలో 40 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్‌ జరగ్గా మంగళవారంతో పూర్తయ్యింది. పశ్చిమబెంగాల్‌లో మూడో దశ పోలింగ్‌ జరిగింది. అసోంలో చివరి దశ పోలింగ్‌లో భారీగా ఓటింగ్‌ నమోదైంది. నేటితో మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగా ఒక్క పశ్చిమబెంగాల్‌లో మాత్రం ఎన్నికలు కొనసాగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో పోలింగ్‌ జరుగుతుండగా మంగళవారంతో మూడు దశలు పూర్తయ్యింది. ఇక ఏప్రిల్‌ 10, 17, 22, 26, 29 తేదీల్లో మలి విడతల్లో పోలింగ్‌ జరగనుంది. 

చివరి సమాచారం అందే వరకు నమోదైన పోలింగ్‌ శాతం
ప‌శ్చిమ బెంగాల్:
77.68
త‌మిళ‌నాడు : 65.15
కేర‌ళ : 70.16
అసోం : 82.28
పుదుచ్చేరి : 78.24

5 గంటల వరకు నమోదైన పోలింగ్‌
ప‌శ్చిమ బెంగాల్: 76.84 శాతం
త‌మిళ‌నాడు : 61.34 శాతం
కేర‌ళ : 69.24 శాతం
అసోం : 78.32 శాతం
పుదుచ్చేరి : 76.46 శాతం

4 గంటల వరకు పోలింగ్‌ శాతం
ప‌శ్చిమ బెంగాల్:
67.27
త‌మిళ‌నాడు : 53.35
కేర‌ళ : 59.91
అసోం : 68.31
పుదుచ్చేరి : 66.36

3 గంటల వరకు పోలింగ్‌
పశ్చిమ బెంగాల్: 54.43శాతం
త‌మిళ‌నాడు : 43.40శాతం
కేర‌ళ : 51.4శాతం
అసోం : 54.73
పుదుచ్చేరి : 54.27శాతం

రెండు గంటల వ‌ర‌కు న‌మోదైన పోలింగ్ శాతం
ప‌శ్చిమ బెంగాల్: 54.43
త‌మిళ‌నాడు : 40.94
కేర‌ళ : 51.4
అసోం : 53.23
పుదుచ్చేరి : 54.21

ఒంటి గంట వ‌ర‌కు న‌మోదైన పోలింగ్ శాతం
ప‌శ్చిమ బెంగాల్: 53.89
త‌మిళ‌నాడు : 39.61
కేర‌ళ : 43.3
అసోం : 53.23
పుదుచ్చేరి : 53.35

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top