రోజంతా కేజ్రీవాల్‌ ధ్యానం

Arvind Kejriwal begins day-long meditation to pray for country - Sakshi

గాంధీ విగ్రహం వద్ద నివాళులు

న్యూఢిల్లీ: దేశాభ్యున్నతి కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం రోజంతా ధ్యానం, పూజలు, ప్రార్థనలు చేశారు. అవి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం దాకా కొనసాగినట్టు ఆప్‌ ట్వీట్‌ చేసింది.

అంతకుముందు ఉదయం ఢిల్లీలో రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మాగాంధీ సమాధిని కేజ్రీవాల్‌ సందర్శించి నివాళులర్పించారు. హోలీ సందర్భంగా దేశం కోసం ప్రార్థనలు చేస్తానని కేజ్రీవాల్‌ మంగళవారమే పేర్కొన్నారు. దేశం కోసం మంచి పనులు చేస్తున్న వారిని జైళ్లపాలు చేస్తున్నారని, దోచుకుంటున్న వారిని మాత్రం వదిలేస్తున్నారని ఆరోపించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top