ఆర్టికల్‌ 370పై సుప్రీం తీర్పు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే.. | Sakshi
Sakshi News home page

Article 370: ఆర్టికల్‌ 370పై సుప్రీం తీర్పు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..

Published Mon, Dec 11 2023 1:30 PM

Article 370 is not only Legal but also a ray of hope say PM Narendra Modi - Sakshi

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ రూపంలో తన స్పందన తెలియజేశారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని కోర్టు ఆమోదించిందని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

‘ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనది. 2029, ఆగస్టు 5న భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమైందని సుప్రీంకోర్టు సమర్ధించింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్‌ ప్రజల ఆశ, పురోగతికి ఐక్యతకి ఇది అద్భుతమైన ప్రకటన. భారతీయులు గౌరవించే ఐక్యతా సారాంశాన్ని సుప్రీంకోర్టు బలపరిచింది. జమ్మూకశ్మీర్, లడఖ్‌లోని ప్రజల కలలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నాను. అభివృద్ధి ఫలాలు జమ్మూకాశ్మీర్ ప్రజలకు చేరడమే కాకుండా, ఆర్టికల్ 370 కారణంగా నష్టపోయిన  అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు వాటి ప్రయోజనాలను అందజేయాలని నిశ్చయించుకున్నాం. ఈరోజు తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు మాత్రమే కాదు..ఇది ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకోసం  బలమైన, మరింత ఐక్యతాయుత భారతదేశాన్ని నిర్మించాలనే తమ సంకల్పానికి సుప్రీంకోర్టు తీర్పు నిదర్శనమని’ ప్రధాని మోదీ పేర్కొన్నారు.
 

‘ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత పేదలు, అణగారిన వర్గాల ప్రజల హక్కుల పునరుద్ధరణ జరుగుతుంది. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. స్థానిక ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడం, అత్యాధునిక విద్యా మౌలిక సదుపాయాలను కల్పించడం, పేదలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఆర్టికల్‌ 370 పూర్వాపరాలు.. ఎందుకు రద్దు చేశారు?
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement