ప్రశాంతంగా ఉంటే అద్భుతాలు చేయగలం అంటే ఇదేనేమో!

Angry elephant charged at a bus in Tamil Nadu shattering its windshield - Sakshi

చెన్నై: ఇంతవరకూ ఏనుగులు పంటలను నాశనం చేయడం, మనుష్యుల పై దాడి చేయడం చూశాం. అలాగా ఇటీవల కొన్ని చోట్ల రహాదారులపైకి వచ్చి కారులను, వ్యాన్‌లను తన తొండంతో ఎత్తిపడేసి నుజ్జునుజ్జు చేసిన ఉదంతలు వింటున్నాం. అయితే అచ్చం ఇలానే తమిళనాడులోని ఒక ఏనుగు ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు పై దాడి చేసింది. కాకపోతే ఎవ్వరికీ ఏమి కాలేదు.

(చదవండి: ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా?)

వివరాల్లోకెళ్లితే ....ప్రభుత్వ ఉద్యోగస్తులను  కోటగిరి నుంచి మెట్టుపాలయంకి తీసుకువెళ్లే నీలగిరి బస్సు పైకి ఒక ఏనుగు ఉన్నట్టుండి  అనుహ్యంగా దాడి చేసింది. పైగా తన తొండంతో బస్సు అద్దాలను పగలగొట్టింది. దీంతో బస్సులో ఉన్నవాళ్లందరూ భయంతో ఆహాకారాలు చేశారు. వెంటనే ఆ డ్రైవర్‌ చాకచక్యంగా ప్రయాణికులందర్నీ బస్సు వెనుక వైపుకి తీసుకువచ్చి సురక్షితంగా ఉండేలా చేశాడు.

ఈ మేరకు ఏనుగు కాసేపటకీ అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. అంతేకాదు అంతటి విపత్కర సమయంలో డైవర్‌ ఏమాత్రం కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండటం విశేషం. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వ అటవీ పర్యావరణ, వాతావరణ మార్పుల ప్రధాన కార్యదర్శి సుప్రీయ సాహు ఈ వీడియోకి "ప్రశాంతంగా ఉంటే అద్భుతాలు చేయగలం" అనే ట్యాగ్‌లైన్‌ను జోడించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది.  ఈ మేరకు నెటిజన్లు  ఉ‍ద్యోగస్తులను కాపాడిన తీరు, విపత్కర పరిస్థితల్లో బస్సు డ్రైవర్‌ స్పందించిన తీరుకి ఫిదా అవుతున్నాం గురూ అంటూ... అతని పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

(చదవండి: మహిళ పోలీస్‌ అధికారి బాత్రూమ్‌లో కెమెరా.. స్నానం చేస్తుండగా గమనించి..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top