రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌? ప్రియాంకపై వీడని ఉత్కంఠ? | Sakshi
Sakshi News home page

రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌? ప్రియాంకపై వీడని ఉత్కంఠ?

Published Mon, Apr 29 2024 12:38 PM

Amethi Raebareli Seat Congress Decision Today

యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి కాంగ్రెస్ ఎవరిని ఎన్నికల బరిలోకి దింపుతున్నదనే విషయం ఇంకా వెల్లడి కాలేదు. అయితే రాహుల్ గాంధీ అమేథీ నుండి కాకుండా రాయ్‌బరేలీ నుండి ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వార్త తాజాగా వినిపిస్తోంది. అదేవిధంగా ప్రియాంక గాంధీని ఎన్నికల పోరులో నిలబెట్టే ఆలోచన కాంగ్రెస్‌కు లేదని కూడా అంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ వాద్రా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే, లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఆరాధన మిశ్రా అధినాయకత్వాన్ని కోరినట్లు సమాచారం.

రాహుల్ గాంధీ 2004 నుంచి 2019 వరకు అమేథీ లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ గాంధీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ  పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈసారి రాయ్‌బరేలీ నుండి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆమె రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా రెండు దశాబ్దాల పాటు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. కొద్దిసేపటిలో కాంగ్రెస్‌ అమెథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలు అభ్యర్థుల పేర్లను వెల్లడించనుంది. దీంతో  ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement