
యశవంతపుర: సముద్రాల్లో తిమింగళాలు చేసుకునే వాంతి (అంబర్‌గ్రిస్) బెంగళూరులో పెద్దమొత్తంలో పట్టుబడింది. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల తయారీ ముడిపదార్థంగా అంబర్‌గ్రిస్‌కు పేరుంది. బెంగళూరు కేజీహళ్లి పోలీసులు సయ్యద్ తజ్ముల్‌పాషా (54), సలీంపాషా (48), నాసీర్ పాషా(34), రఫీవుల్లా షరీఫ్ (45) అనే నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6 కేజీల అంబర్‌గ్రిస్ ముద్దలను స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.8 కోట్ల వరకూ ఉంటుందని తెలిపారు. నగరంలోని ఓ కొబ్బరితోటలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసి పోలీసులు దాడి చేయగా ఇది పట్టుబడింది. వీరికి అంబర్‌గ్రిస్ ఎక్కడ నుండి వచ్చిందనేది విచారణ చేపట్టారు.
(చదవండి: Bombay HC: కరోనా మనందరి అతిపెద్ద శత్రువు.. సర్జికల్ దాడి చేయాల్సిందే!)