Bombay HC: కరోనా మనందరి అతిపెద్ద శత్రువు.. సర్జికల్‌ దాడి చేయాల్సిందే!

Bombay HC Says Covid Vaccination Should Be Like Surgical Strike - Sakshi

వైరస్‌ విస్తృతి కట్టడిలో కేంద్రం దూకుడుగా ముందుకెళ్లాలి

ముంబై: శత్రువును అంతంచేయాలంటే సరిహద్దు దాటి మన భూభాగంలోకి వచ్చేదాకా ఆగుతానంటే కుదరదని, దూకుడుగా ముందుకెళ్లి ‘సర్జికల్‌’ దాడి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచించింది. కరోనా వైరస్‌ విస్తృతికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం దుందుడుకు వైఖరితో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టాలని బాంబే హైకోర్టు ఉపదేశించింది. వైరస్‌ వాహకుడైన వ్యక్తి కోవిడ్‌ టీకా కేంద్రానికొచ్చేదాకా ప్రభుత్వం వేచిచూస్తా నంటే కుదరదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వమే ‘ఇంటికి దగ్గర్లోనే’ టీకా కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతనిచ్చి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని హైకోర్టు సూచించింది.

ఇళ్లకే వెళ్లి కోవిడ్‌ టీకా
75 ఏళ్ల వయసు పైబడిన వారు, ముఖ్యంగా వికలాంగులు, మంచానికి, వీల్‌చైర్‌కు పరిమితమైన నిస్సహాయులకు వారి ఇళ్లకే వెళ్లి కోవిడ్‌ టీకా వేయాలని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ధృతి కపాడియా, కునాల్‌ తివారీ అనే న్యాయవాదులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలుచేశారు. ఈ పిల్‌ను బాంబే హైకోర్టు సీజే జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ జీఎస్‌ కులకర్ణిల డివిజిన్‌ బెంచ్‌ బుధవారం విచారించింది.

కరోనా మనందరి ఉమ్మడి అతిపెద్ద శత్రువు
‘కరోనా మనందరి ఉమ్మడి అతిపెద్ద శత్రువు. మనందరం వీలైనంత త్వరగా వైరస్‌ ఉధృతిని ఆపాలి. కొన్ని ప్రాంతాల్లో వైరస్‌ విజృంభణ ఎక్కువై, అక్కడి ప్రజలు(వృద్ధులు, తదితరులు) కోవిడ్‌ కేంద్రాల దాకా రాలేని పరిస్థితులున్నాయి. సర్జికల్‌ దాడి తరహాలోనే మన కోవిడ్‌ అదుపు విధానం ఉండాలి. మీరు సరిహద్దు(కోవిడ్‌ కేంద్రం) వద్ద నిలబడి కరోనా వాహకుడి కోసం ఎదురుచూస్తున్నారు. వైరస్‌ వ్యాపించిన ప్రాంతాల్లోకి వెళ్లట్లేరు. మీరే అక్కడికెళ్లి అంతంచేయాలి’ అని సీజే దత్తా అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోందని, కానీ నిర్ణయాల అమలులో తీవ్ర జాప్యం కారణంగా ఎన్నో ప్రాణాలను పోగొట్టుకుంటున్నామని బెంచ్‌ వ్యాఖ్యానించింది.

ఇంటికి దగ్గర్లో టీకా కేంద్రం
ఇంటింటికీ టీకా కార్యక్రమం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యంకాదని, ‘ఇంటికి దగ్గర్లో టీకా కేంద్రం’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించ నున్నామని కేంద్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు స్పందించింది. ‘కేరళ, జమ్మూ కశ్మీర్, బిహార్, ఒడిశా రాష్ట్రాలుసహా మహారాష్ట్రలోని వసాయ్‌–విహార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో డోర్‌–టు–డోర్‌ వ్యాక్సినేషన్‌ అమల్లో ఉంది. ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాల్లో మీరెందుకు ప్రోత్సహించట్లేరు? కేంద్రం నుంచి అనుమతులొచ్చే దాకా వారేమీ డోర్‌–టు–డోర్‌ కార్యక్రమాన్ని మొదలుపెట్టకుండా ఆగలేదు కదా’ అని హైకోర్టు ఉదహరించింది.

(చదవండి: ముంబైని ముంచెత్తిన వర్షాలు )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-06-2021
Jun 10, 2021, 04:58 IST
సాక్షి, హైదరాబాద్‌: సమయం లేదు మిత్రమా.. శరణమా... రణమా? తేల్చుకోవాల్సిన తరుణమిదే!! ఊహూ.. కొన్నేళ్ల క్రితం నాటి సినిమా డైలాగ్‌ ఏమాత్రం...
10-06-2021
Jun 10, 2021, 02:01 IST
వాషింగ్టన్‌: ఇంట్లోనే ఉంటున్నాంకదా మాస్కు ధరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారా? అలా చేయడం కరోనాను చేజేతులా ఆహ్వానించడమే అవుతుందని పరిశోధకులు...
10-06-2021
Jun 10, 2021, 01:37 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారి పిల్లల్లోనూ ప్రభావం చూపిస్తోంది. చిన్నారులు సైతం వైరస్‌ బారినపడుతున్నారు. అయితే, వారిలో లక్షణాలు అంతగా కనిపించడం...
09-06-2021
Jun 09, 2021, 18:29 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 93,511 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,766 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో...
09-06-2021
Jun 09, 2021, 16:57 IST
చనిపోయాక ఎక్స్‌గ్రేషియా కన్నా..బతికేందుకు అవకాశం ఇవ్వాలని, నిధులు సమకూర్చాలంటూ వేడుకున్న డీఎస్పీ లెవెల్​ అధికారి ఇక లేరు.  పంజాబ్‌కు చెందిన డిప్యూటీ జైలు...
09-06-2021
Jun 09, 2021, 15:13 IST
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా మహమ్మారి చికిత్సలో డా.రెడ్డీస్‌తో కలిసి అభివృద్ధి చేసిన 2-డీజీ ఉత్పత్తికి సంబంధించి డీఆర్‌డీవో  కీలక విషయాన్ని ప్రకటించింది.  ఈ డ్రగ్‌ను...
09-06-2021
Jun 09, 2021, 14:45 IST
న్యూఢిల్లీ: డ్యూటీలో ఉండగా సోషల్ మీడియా కోసం వీడియోలను చేసిన ఢిల్లీ చెందిన ఇద్దరు పోలీస్‌ సిబ్బందికి షో కాజ్ నోటీసు...
09-06-2021
Jun 09, 2021, 13:44 IST
సాక్షి, హైదరాబాద్‌:  టీకా కేటాయింపుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ పంపిణీకి నిర్ణయం తీసుకున్న...
09-06-2021
Jun 09, 2021, 13:42 IST
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు...
09-06-2021
Jun 09, 2021, 12:13 IST
హాంకాంగ్‌ : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుడ్‌న్యూస్.  హాంకాంగ్‌ నగరంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన వారికి  ఖరీదైన టెస్లా కార్లను, గోల్డ్‌...
09-06-2021
Jun 09, 2021, 12:04 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనాతో అనాథలైన పిల్లలను గుర్తించే పనిలో ఉన్నామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనురాధ పేర్కొన్నారు. బుధవారం...
09-06-2021
Jun 09, 2021, 11:29 IST
జైపూర్‌: అసలే కరోనా వ్యాక్సిన్లు దొరక్క ప్రజలు అవస్థలు పడుతుంటే.. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 480 కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు నిరుపయోగంగా...
09-06-2021
Jun 09, 2021, 10:05 IST
దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,75,04,126 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 12,31,415 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
09-06-2021
Jun 09, 2021, 09:34 IST
కరోనాతో అందరి బతుకులు ఆగమవుతున్నాయి. ఉపాధి కోల్పోయి పూటగడవని పరిస్థితుల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఫొటోగ్రాఫర్ల జీవితాల్లో కరోనా వైరస్‌...
09-06-2021
Jun 09, 2021, 09:17 IST
హరిద్వార్‌: కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను తలకిందులు చేసింది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న మనిషిని మాయదారి రోగానికి కోల్పోతే ఆ...
09-06-2021
Jun 09, 2021, 08:42 IST
ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా రూ.6 లక్షలు ఖర్చు అయింది. అయినా నిత్యం ఆక్సిజన్‌  లెవెల్స్‌ పడిపోతుండటం,...
09-06-2021
Jun 09, 2021, 08:34 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ రూపాంతరాలపై కూడా తాము అభివృద్ధి చేసిన 2–డీఆక్సీ–డీ గ్లూకోజ్‌ (2–డీజీ) సమర్థంగా పనిచేస్తుందని డీఆర్‌డీవోకు...
09-06-2021
Jun 09, 2021, 08:15 IST
న్యూఢిల్లీ: ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతులు కాంతాప్రసాద్, ఆయన భార్య బాదామీ దేవి గుర్తున్నారా? వారి కథ మళ్లీ...
09-06-2021
Jun 09, 2021, 07:40 IST
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ డిసెంబర్‌ నాటికి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడంపై కేంద్రం తన విధానాన్ని, రోడ్‌ మ్యాప్‌ను పార్లమెంట్‌లో...
09-06-2021
Jun 09, 2021, 06:56 IST
సాక్షి, హైదరాబాద్‌: పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసరాల పంపిణీకి వినియోగిస్తున్న ఐరిస్‌ సాంకేతికతతో కరోనా వ్యాపించే అవకాశం ఉందంటూ...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top