కేంద్రానిక్‌ షాక్‌.. పంతం నెగ్గించుకున్న మమత

Alpana Bandyopadhyay Resigned For His Bengal CS Post - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చారు. తన పంతం నెగ్గించుకునేందుకు ఆలాపన్‌ బందోపాధ్యాయను బెంగాల్‌ సీఎస్‌ పదవికి రాజీనామా చేయించి ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. సోమవారం ఆలాపన్‌ బందోపాధ్యాయ బెంగాల్‌ సీఎస్‌ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా సీఎం మమతా బెనర్జీకి ముఖ్య సలహాదారుగా చేరిపోయారు. నెలకు రూ.2.5 లక్షల వేతనంతో ఆలాపన్‌ బందోపాధ్యాయను మమతా తన ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఆయన మూడేళ్లపాటు ఆమె వద్ద పనిచేయనున్నారు.

కాగా, ఇటీవల యాస్‌ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి మమతా ఆలస్యంగా రాగా.. సీఎస్​తో సహా ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో సీఎస్‌ ఆలపన్​ బందోపాధ్యాయను వెనక్కి పంపించాల్సిందిగా బెంగాల్​ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆయనను వెనక్కి పంపించేది లేదని మమతా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే  తన పంతం నెగ్గించుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

చదవండి :చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను: మమతా బెనర్జీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top