అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమం | Ahmed Patel Health Condition Serious | Sakshi
Sakshi News home page

అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమం

Nov 15 2020 4:04 PM | Updated on Nov 15 2020 10:25 PM

Ahmed Patel Health Condition Serious - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నెలలో కరోనా పాజిటివ్‌గా తేటడంతో గుర్‌గ్రామ్‌లోని ప్రముఖ మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆరోగ్యం విషమంగా మారడంతో ఐసీయూలోకి తరలించారు. అక్టోబర్‌ 1 నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తలెత్తిందని చెప్పారు. మరోవైపు అ‍హ్మద్‌ పటేల్‌ ఆరోగ్యంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన  చెందుతున్నారు. పూర్తిగా కోలుకుని అరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement