ఆధార్ యూజర్లకు ముఖ్య గమనిక

Aadhaar Update: Use mAadhaar App to Avail Over 35 Services - Sakshi

న్యూఢిల్లీ: ఆధార్ కార్డును రూపొందించే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియ(యుఐడిఎఐ) పలు రకాల సేవలను వినియోగదారుల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు నవీకరిస్తుంది. తాజాగా పాత ఎంఆధార్ యాప్ ను మొబైల్ ఫోన్ నుంచి తొలగించి కొత్తగా తీసుకొచ్చిన యాప్ ను డౌన్లొడ్ చేసుకోవాలని వినియోగదారులను కోరింది. ఇటీవల ఎంఆధార్ యాప్‌ ఫీచర్స్‌లో పలు మార్పుల్ని చేసింది యుఐడిఎ. అందుకే సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు వెంటనే పాత యాప్ డిలిట్ చేసి ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి కొత్త యాప్ ఇన్‌స్టాల్ చేయాలని కోరుతోంది. కొత్త వెర్షన్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందని ట్విటర్ ద్వారా వెల్లడించింది. 13 భాషల్లో అందుబాటులో ఉన్న కొత్త యాప్ లో 35 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఎంఆధార్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్, అప్‌డేట్ స్టేటస్ చెక్ చేసుకోవడం, ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం, బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్ వంటి ఇతర సేవలను ఆన్‌లైన్ సేవలు పొందవచ్చు. 

చదవండి: మాస్టర్‌ కార్డు వినియోగదారులకు శుభవార్త!

              ఈ యాప్ ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top