Azadi Ka Amrit Mahotsav: 7 రోజుల్లో 450 జాతీయ జెండాలు

91-year-old Bihar villager stitches 450 national flags in seven days - Sakshi

బిహార్‌లో 91 ఏళ్ల వృద్ధుడి ఘనత  

పట్నా: 91 ఏళ్ల వృద్ధుడు కేవలం వారం రోజుల్లో ఏకంగా 450 జాతీయ జెండాలను తన కుట్టుమెషీన్‌పై కుట్టాడు. ఈ అరుదైన సంఘటన బిహార్‌ రాష్ట్రం సుపౌల్‌ జిల్లా నిర్మాలీలో చోటుచేసుకుంది. లాల్‌మోహన్‌ పాశ్వాన్‌(91) అచ్ఛమైన గాంధేయవాది. దర్జీగా జీవనం సాగిస్తున్నారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సంందర్భంగా ‘హెల్ప్‌ ఏజ్‌ ఇండియా’ అనే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ జాతీయ జెండాల కోసం లాల్‌మోహన్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. కేవలం 7 రోజుల్లో 450 జెండాలు కుట్టి హెల్ప్‌ ఏజ్‌ ఇండియాకు అందజేశారు. రోజుకు 12 గంటలపాటు పనిచేసి, జెండాలు కుట్టానని లాల్‌మోహన్‌ చెప్పారు. జెండాలు కుట్టడాన్ని పవిత్రమైన బాధ్యతగా భావించానని, స్వాతంత్య్ర దినోత్సవ కంటే ముందు రోజే జెండాలను అందజేసినందుకు చాలా గర్వించానని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top