లేటు వయసులో జాక్‌పాట్.. లాటరీలో రూ.5 కోట్లు గెలుచుకున్న వృద్ధుడు

88 Year Old Man Wins Rs 5 Crore Lottery In Punjab Derabassi - Sakshi

చండీగఢ్‌: అదృష‍్టం తలుపుతడితే రాత్రికి రాత్రే  జీవితాలు మారిపోతాయి అంటారు. పంజాబ్ డేరాబస్సికి చెందిన ఓ వృద్ధుడి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. 88 ఏళ్ల వయసులో అతనికి జాక్‌పాట్ తగిలింది. సంక్రాంతి లాటరీలో ఏకంగా రూ.5 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో ఆయన కుటుంబం పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. చుట్టుపక్కల వాళ్లు కూడా అతనికి పూలమాలలు వేసి అభినందించారు.

లాటరీ గెలుచుకున్న ఇతని పేరు మహంత్ ద్వారకా దాస్. డేరాబస్సిలోని త్రివేది క్యాంప్‌లో నివాసముంటున్నాడు. 1947లో 13 ఏళ్ల వయసులో పాకిస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. సాధారణ కూలీ పనులు చేసి జీవనం సాగించేవాడు.

అయితే ఇతనికి ఓ అలవాటు ఉంది. గత 40 ఏళ్లుగా తరచూ లాటరీలు కొనుగోలు చేస్తున్నాడు. ఏదో ఒకరోజు అదృష్టం తన తలుపుతట్టి కుటుంబం తలరాత మారుతుందని ఆశించేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఓ ల్యాటరీ కొనుగులు చేశాడు. కచ్చితంగా కొన్ని అంకెలు ఉండే లాటరీ నంబర్ కావాలని చెప్పి తన మనవడితో దీన్ని కొనుగోలు చేయించాడు. కొద్ది రోజుల తర్వాత అదే నంబర్‌కు లాటరీ తలిగింది. దీంతో మహంత్ కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు.

లాటరీ గెలుచుకున్న వృద్ధుడు..

ఈ లాటరీలో రూ.5 కోట్లు గెలుచుకోగా.. ట్యాక్స్ పోను అతనికి రూ.3.5 కోట్లు రానుంది. ఇందులో సగం తన ఇద్దరు కుమారులకు సమానంగా పంచుతానని, మిగతా సగం డేరాకు విరాళంగా ఇస్తానని మహంత్ పేర్కొన్నాడు. ఇన్నాళ్లకు తన లాటరీ కల నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నాడు.
చదవండి: హిమగర్భంలో భారీ ఉల్క

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top