విషాదం.. దేవాలయంలో గోడకూలి 9 మంది చిన్నారుల మృతి | 8 Killed After Madhya Pradesh Temple Wall Collapses | Sakshi
Sakshi News home page

విషాదం.. దేవాలయంలో గోడకూలి 9 మంది చిన్నారుల మృతి

Aug 4 2024 12:05 PM | Updated on Aug 4 2024 1:03 PM

8 Killed After Madhya Pradesh Temple Wall Collapses

భోపాల్‌: మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ దేవాలయం గోడ కూలిన ఘటనలో మృతి చెందిన పిల్లల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఆదివారం ఉదయం సాగర్‌ జిల్లాలోని షాపూర్‌ అనే ప్రాంతంలో హర్దౌల్ బాబా (Hardaul Baba) ఆలయంలో మతపరమైన వేడుకలు జరిగే సమయంలో గోడ కూలి  తొమ్మిది మంది మరణించారు.  శిధిలాల కింద చిక్కుకున్న భక్తుల ప్రాణాలు కాపాడారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ క్షత గాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

 

దేవాలయంలో జరిగిన ఈ విషాదంపై సమాచారం అందుకున్న సాగర్‌ జిల్లా కలెక్టర్‌ దీపక్‌ ఆర్య సందర్శించారు. గాయపడ్డ బాధితుల్ని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. బాధితులకు వెంటనే వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement