డేంజరస్‌ డెల్టా ప్లస్‌.. 66 మందిలో నిర్ధారణ, ఐదుగురి మృతి 

66 Delta Plus Patients Found In Maharashtra 5 Of Deceased - Sakshi

పంజా విసురుతున్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌ 

ఇప్పటివరకు 66 మందిలో నిర్ధారణ.. ఐదుగురి మృతి 

సాక్షి, ముంబై: రాష్ట్రంపై దాడి చేసేందుకు కరోనా మహమ్మారి మరో రూపంలో సిద్ధమైంది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ రూపంలో పంజా విసరడం మొదలు పెట్టింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 66 మందికి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్లు నిర్ధారణ కాగా.. అందులో అయిదుగురు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. నమోదైన 66 డెల్టా ప్లస్‌ కేసుల్లో అత్యధికంగా జల్‌గావ్‌ జిల్లాలో 13 కేసులున్నాయి. డెల్టా ప్లస్‌ కేసులలో జల్‌గావ్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, రత్నగిరి జిల్లాలో 12 కేసులున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 11 మందికి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిందని తేలింది. అయితే ఈ 66 మందిలో 32 మందిపై వైరస్‌ ప్రభావం అంతగా లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, మిగతావారిలో 18 ఏళ్ల లోపు వయసు వారు కూడా ఉన్నారు. దీంతో అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్‌లాక్‌ 3.0లో భాగంగా పలు ప్రాంతాల్లో ఆంక్షలను సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆంక్షలు సడలిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ విస్తరణపై ఎలా ప్రభావం చూపనుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా, డెల్టా ప్లస్‌ ముప్పు పొంచి ఉందని, ఈ వేరియంట్‌ చాపకింద నీరులా విస్తరిస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ కచ్చితంగా నియమాలను పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ అతివేగంగా వ్యాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రెండు డోసులు తప్పనిసరి 
డెల్టా ప్లస్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులు కరోనా టీకా రెండు డోసులు తీసుకుని ఉండాలని నియమం పెట్టింది. టీకా రెండు డోసులు తీసుకోనివారు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకొని నెగెటివ్‌ రిపోర్టు చూపించడం తప్పనిసరి చేసింది. ఈ రెండు నియమాలను పాటించకపోతే 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని స్పష్టం చేసింది. 

ఆగస్టు 15 నుంచి వర్తించే సడలింపులు 
మాల్స్, రెస్టారెంట్స్‌ 50 శాతం సామర్థ్యంతో రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే, సిబ్బందికి వ్యాక్సినేషన్‌ పూర్తయి ఉండాలని షరతును పెట్టింది. 
షాపులు కూడా రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. 
స్పా, జిమ్‌లు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 10 గంటల వరకు నడిపేందుకు పలు షరతులతో అనుమతించింది. 
బహిరంగ ప్రాంతాల్లో జరిగే వివాహ వేడుకలకు ఇకపై 200 మందిని అనుమతించనున్నారు. హాళ్లలో జరిగే కార్యక్రమాలకు స్థలాన్ని బట్టి 50 మందిని లేదా 100 మందిని అనుమతించనున్నారు. 
ఇండోర్‌ క్రీడలకు అనుమతి లభించింది. 
సినిమా హాళ్లు, ప్రార్థనా స్థలాలు మాత్రం తదుపరి ఆదేశాల వరకు మూసి ఉండనున్నాయి. 
ఇన్నాళ్లు లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు సామాన్యులకు అనుమతి ఉండేది కాదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర విభాగాల్లో పనిచేసే వారిని మాత్రమే అనుమతించారు. కానీ, కరోనా టీకా రెండు డోసులు తీసుకుని 14 రోజులు పూర్తయినవారిని ఇకపై లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించనున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా ప్రకటన చేయడంతో రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిన ప్రయాణికులకు పాసులు కూడా జారీ చేస్తున్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

15-08-2021
Aug 15, 2021, 08:53 IST
దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 53 కోట్లు దాటింది.
14-08-2021
Aug 14, 2021, 19:41 IST
కరోనా వైరస్‌కు సంబంధించి రెండు టీకా డోసులు తీసుకోవడం లేదా ఆర్‌పీసీఆర్‌ పరీక్ష నివేదిక ఉన్నవారికి మాత్రమే...
14-08-2021
Aug 14, 2021, 15:53 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 1,535 కరోనా...
14-08-2021
Aug 14, 2021, 07:39 IST
సాక్షి, బెంగళూరు: కోవిడ్‌ మహమ్మారి రెండో దశ బలహీనమై కేసుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో రాష్ట్రంలో మూడోదశ మొదలైందనే వార్త ఆందోళన...
13-08-2021
Aug 13, 2021, 19:47 IST
న్యూఢిల్లీ: భారత్‌ బయెటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌ రెండోదశ ట్రయల్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. ముక్కు ద్వారా వేసే కోవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌...
13-08-2021
Aug 13, 2021, 17:11 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 73,341 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,746 మందికి కరోనా...
13-08-2021
Aug 13, 2021, 10:56 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,120 కరోనా పాజిటివ్‌...
12-08-2021
Aug 12, 2021, 14:57 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిన చైనాను ఇప్పుడు డెల్టా వేరియంట్‌ బెంబెలెత్తిస్తోంది. తాజాగా డ్రాగన్‌ దేశంలో డెల్టా...
12-08-2021
Aug 12, 2021, 06:24 IST
కరోనా వైరస్‌ ముప్పు ఉన్నప్పటికీ పాఠశాలలు ప్రారంభించడానికే ప్రపంచ దేశాలన్నీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌...
11-08-2021
Aug 11, 2021, 17:09 IST
తిరువనంతపురం: దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతుండగా.. కేరళలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికి కేర‌ళ‌లో భారీగా...
11-08-2021
Aug 11, 2021, 15:57 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో  71,030 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...
11-08-2021
Aug 11, 2021, 14:33 IST
ఆల్ఫా, బీటా, డెల్టా, గామా, కప్పా, ల్యామ్డా, డెల్టా ప్లస్‌... ఇలా మహమ్మారి కరోనా అనేక రూపాలు మార్చుకుంటూ మానవాళిని...
10-08-2021
Aug 10, 2021, 17:53 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో  63,849 మందికి కరోనా పరీక్షలు...
09-08-2021
Aug 09, 2021, 17:40 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 85,283 మందికి కరోనా పరీక్షలు...
09-08-2021
Aug 09, 2021, 10:44 IST
ఆదివారం వచ్చిందంటే చాలు సిటిజనులు ఎక్కడున్నా బీచ్‌లో వాలిపోవాల్సిందే..కరోనా కారణంగా చాలా రోజులు బీచ్‌ మొఖం చూడడమే మానేశారు. ఇటీవల...
08-08-2021
Aug 08, 2021, 20:48 IST
హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కాగా, గడిచిన 24 గంటలలో కొత్తగా 449 కరోనా కేసులు...
08-08-2021
Aug 08, 2021, 17:46 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 85,283 మందికి కరోనా పరీక్షలు...
07-08-2021
Aug 07, 2021, 17:27 IST
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 80,376 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  కొత్తగా 1,908 కరోనా...
07-08-2021
Aug 07, 2021, 10:52 IST
సాక్షి బెంగళూరు: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొద్దిరోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేట్‌...
07-08-2021
Aug 07, 2021, 08:36 IST
మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు... సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు ప్రారంభం
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top