Bihar Goods Train Incident: పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు 53 బోగీలు

53 Wagons Of A Coal Laden Goods Train Derailed In Bihar Video - Sakshi

పాట్నా: బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ రైలు బిహార్‌లో పట్టాలు తప్పింది. గుర్పా రైల్వే స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు 53 బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, ధన్‌బాద్‌ డివిజన్‌ పరిధిలోని కొడెర్మా-మన్‌పూర్‌ రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున 6.24 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. 

‘బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు బోగీలు పట్టాలు తప్పేందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు రైల్వే బృందాలు కృషి చేస్తున్నాయి.’ అని ఈసీఆర్‌ జోన్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన క్రమంలో అధికారులు అప్రమత్తమవటంతో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదన్నారు. 10 రైళ్లను దారి మళ్లించామని, నాలుగు రైళ్లు రద్దు చేశామని చెప్పారు.

ఇదీ చదవండి: హనీట్రాప్‌: ఆమె ఎవరో తెలియదు.. కానీ, అంతా ఆమె వల్లే జరిగింది!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top