దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు.. మరణాలు | 50040 New Corona Cases Recorded In India | Sakshi
Sakshi News home page

దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు.. మరణాలు

Jun 27 2021 10:13 AM | Updated on Jun 27 2021 10:17 AM

50040  New Corona Cases Recorded In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,040  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో  1,258 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 3,95,751 మంది ప్రాణాలు కోల్పోయారు.

అంతేకాకుండా గత 24 గంటల్లో 57,944 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,92,51,029 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం  5,86,403 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,02,33,183 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
 

చదవండి: ఆక్సిజన్‌ డిమాండ్‌పై రగడ: బీజేపీ, ఆప్‌ పరస్పరం విమర్శలు

Advertisement
 
Advertisement
Advertisement