అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో రెండు కరోనా వ్యాక్సిన్లు

5 vaccines under trial in India two in advanced stage: VK Paul - Sakshi

5 వ్యాక్సిన్లు  ట్రయల్స్‌లో ఉన్నాయి: వీకే పాల్‌

సాక్షి,న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్లను రూపొందించే ప్రక్రియ వేగం పుంజుకుంది. అంతర్జాతీయంగా కీలక దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలతో వ్యాక్సిన్‌పై ఆశలను పెంచుతున్నాయి.  దేశీయంగా కనీసం ఐదు వ్యాక్సిన్లు వివిధ దశల ప్రయోగాల్లో ఉన్నాయని, వాటిలో రెండు అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌కు చేరుకున్నాయని  నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యాక్సిన్‌ ఉత్పత్తి , పంపిణీపై ప్రధానమంత్రికి సలహా ఇచ్చే ప్యానెల్ అధిపతి డాక్టర్ వినోద్ పాల్ అన్నారు.  ముఖ్యంగా  భారత్ బయోటెక్‌కు చెందిన భారతీయ వ్యాక్సిన్   కోవాక్సిన్ ఇప్పటికే దశ-3 క్లినికల్ ట్రయల్ ప్రారంభించిందన్నారు.

ప్రస్తుతం భారతదేశంలో ఐదు వ్యాక్సిన్లు వివిధ దశల ట్రయల్స్‌లో ఉన్నాయని పాల్‌  తెలిపారు. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా ఫేజ్-3 అధునాతన దశలో ఉందన్నారు. అలాగే   కాడిలా వ్యాక్సిన్ , రష్యాకుచెందిన  స్పుత్నిక్వి ట్రయల్ ఫేజ్-2 ట్రయల్‌ ప్రిపరేషన్ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు, దీంతోపాటు జైడస్ కాడిలా రూపొందించిన జైకోవ్-డి దేశంలో రెండవ దశ క్లినికల్ ట్రయల్‌లో ఉందని చెప్పారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన మరో టీకా కోవిషీల్డ్ ఇటీవల భారతదేశంలో మూడవ దశ క్లినికల్ ట్రయల్ ను ప్రారంభించింది.అలాగే డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ త్వరలో దేశంలో రష్యన్ కోవిడ్‌-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ రెండవ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుందని తెలిపారు. (కీలక దశకు దేశీయ కరోనా వ్యాక్సిన్‌)

దేశంలో టీకా అందుబాటులోకి వచ్చాక ఫ్రంట్‌లైన్ కార్మికులకే తొలి ప్రాధాన్యమన్నారు. మరణాలను తగ్గించడం,  ఫ్రంట్‌లైన్ కార్మికులను రక్షించడానికే మొదటి ప్రాధాన్యతనివ్వాలని పాల్  తెలిపారు. సుమారు 30 కోట్ల ప్రాధాన్యతా లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది.ప్రారంభ దశలో టీకా అందించేవారిని నాలుగువర్గాల వ్యక్తులుగా వర్గీకరించింది. వైద్యులు, ఎంబిబిఎస్ విద్యార్థులు, నర్సులు, ఆశా కార్మికులతో సహా ఒక కోటి మంది ఆరోగ్య నిపుణులు, మునిసిపల్ కార్పొరేషన్ కార్మికులు, పోలీసు సిబ్బంది, సాయుధ దళాలతో సహా రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ కార్మికులు ఉంటారు. వీరితోపాటు 50 ఏళ్లు పైబడిన 26 కోట్ల మంది;  50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top